తెలుగు చిత్ర పరిశ్రమలో విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. విజయశాంతి ఎక్కువగా లేడి ఓరియంటెడ్ సినిమాలు ఎక్కవగా చేశారు. ఇక లేడి అమితాబ్ బచ్చన్ గా మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో హీరోయిన్లలో కూడా చాలా మంది హీరోయిన్లు ఉన్నప్పటికీ అప్పట్లో విజయశాంతి గారు కొన్ని సంవత్సరాలు నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగారు.

ఇక కెరీర్ మొదట్లో ఎక్కువగా గ్లామర్ పాత్రలనే చేసిన విజయశాంతికి నటిగా మంచి గుర్తింపు ఇచ్చిన సినిమా ‘నేటి భారతం’. ఈతరం ఫిలింస్ పతాకంపై టి.కృష్ణ దర్శకత్వంలోవచ్చిన ఈ చిత్రం నటిగా విజయశాంతికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత నటిగా విజయశాంతి వెనుదిరిగి చూసుకోలేదు. అప్పటికే జయసుధ, జయప్రద తమ అభినయంతో.. శ్రీదేవి, మాధవి తమ అందచందాలతో తెలుగుతెరను ఏలుతున్న రోజుల్లో నటిగా.. విజయశాంతి సినీ ప్రస్థానం ప్రారంభమైంది. అప్పటికే కథానాయికలుగా స్థిరపడిన వారిని సవాలు చేస్తూ విజయశాంతి విజృంభించింది.

ఈమె తన కెరీర్‌లో ఎక్కువగా చిరంజీవి, బాలకృష్ణ, కృష్ణలతో ఎక్కువగా నటించింది. గత నలభై ఏళ్లుగా తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంది. ఈమె కెరీర్ మంచి పీక్స్‌లో ఉండగానే శ్రీనివాస్ ప్రసాద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈయనకు నందమూరి కుటుంబానికి సంబంధం ఉంది. విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ ఎన్టీఆర్ పెద్దల్లడు. గణేష్ రావుకు స్వయాన మేనల్లుడు అవుతాడు. ఈయనకు హీరో బాలకృష్ణకు మంచి ఫ్రెండ్‌షిప్ ఉండేది.

ఇక ఈ దోస్తానాతోనే బాలయ్యతోె ఒక సినిమాను నిర్మించాలనుకున్నాడు. అందులో భాగంగా బాలకృష్ణతో కలిసి యువరత్న ఆర్ట్స్ స్థాపించి.. ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ‘నిప్పురవ్వ’ సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమాలో హీరోయిన్‌గా పలువురు పేర్లు పరిశీలించి చివరకు విజయశాంతిని ఎంపిక చేసారు. ఆ సినిమాలో నటింపజేసేందకు ప్రసాద్.. స్వయంగా విజయశాంతి దగ్గరకు వెళ్లారు. అలా వాళ్ల మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. ఈయన నిర్మాతగా బాలయ్యతో కలిసి ‘నిప్పురవ్వ’ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజిగా నిలిచింది. ఇక బాలయ్య, విజయశాంతి కాంబినేషన్‌లో వచ్చిన చివరి సినిమా ఇదే కావడం విశేషం.

అప్పుడు విజయశాంతి గారి డేట్స్ కోసం ప్రసాద్ వెళ్ళినప్పుడు విజయశాంతికి ప్రసాద్ కి పరిచయం ఏర్పడింది.అప్పటికే విజయశాంతి వాళ్ళ అమ్మానాన్న చనిపోవడంతో ప్రసాద్ పరిచయం ఫ్రెండ్షిప్ గా మారింది ఎంతలా అంటే ప్రసాద్ విజయశాంతి డేట్స్ చూసుకునేవాడు. అలా ఇద్దరి మధ్య ప్రెండ్ షిప్ కుదిరి పెళ్లి చేసుకున్నారు.కొన్నాళ్లపాటు వీళ్ళ కాపురం సాఫీగానే సాగింది.ప్రస్తుతం ప్రసాద్ ఎక్కడ కనిపించినప్పటికీ విజయశాంతి ప్రసాద్ కలిసి ఉంటున్నారా లేదా అనేది తెలియదు.విజయశాంతి మాత్రం సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సరిలేరు నీకెవ్వరు అనే సినిమా తో మంచి కం బ్యాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. విజయశాంతి రాజకీయాల్లో కూడా చురుగ్గా పాల్గొంటోంది ప్రస్తుతం ఆవిడ బిజెపి పార్టీలో కొనసాగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here