సాధారణంగా పోలీసుల దగ్గర తుపాకులు ఉంటాయనే సంగతి మనందరికీ తెలిసిందే. పోలీసులు కాకుండా రాజకీయ, సినీ ప్రముఖులు లైసెన్స్ ఉన్న తుపాకీలను వినియోగిస్తూ ఉంటారు. అయితే తుపాకీలకు ఎవరు వినియోగించవచ్చు..? లైసెన్స్ ఉన్న తుపాకీనీ పొందాలంటే కావాల్సిన అర్హతలేంటి..? అనే విషయాల గురించి చాలామందికి అవగాహన ఉండదు. 1959 నాటి ఆయుధ చట్టం ప్రకారం మన దేశ పౌరులు లైసెన్స్ ఉన్న గన్ ను పొందవచ్చు.

నాన్ ప్రోహిబిటెడ్ బోర్ గన్స్ ను మాత్రమే కొనుగోలు చేయడానికి మన దేశ పౌరులకు అధికారం ఉంటుంది. ఎవరికైనా ప్రాణాలకు ఇతరుల నుంచి ముప్పు ఉంటే లైసెన్స్ ఉన్న గన్ ను పొందవచ్చు. అయితే లైసెన్స్ ఉన్న గన్ ను ఎట్టి పరిస్థితుల్లోను వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించకూడదు. ఆత్మరక్షణ కోసం మాత్రమే లైసెన్స్ ఉన్న తుపాకీని వినియోగించవచ్చు. గన్ లైసెన్స్ పొందాలంటే మొదట ఆ వ్యక్తి ఎఫ్.ఐ.ఆర్ ను సమర్పించాలి.

ఎఫ్.ఐ.ఆర్ ను సమర్పించిన అనంతరం రాష్ట్ర పోలీసు జిల్లా సూపరింటెండెంట్‌ కు గన్ కోసం దరఖాస్తు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత పోలీసులు గన్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి సంబంధించిన కేసులు, చిరునామా, శారీరక, మానసిక స్థితి గురించి విచారణ చేపడతారు. ఆ తరువాత దరఖాస్తు చేసుకున్న వ్యక్తిని డీసీపీ విచారించి దరఖాస్తు చేసుకున్న వ్యక్తి అర్హుడని తేలితే తుపాకీ లైసెస్న్ ను ఇస్తారు.

ఆ తరువాత తుపాకీ డీలర్ ను సంప్రదించి లైసెన్స్ పొందిన దుకాణం నుండి తుపాకీని ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్డర్ చేసుకున్న 60 రోజుల తరువాత దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి తుపాకీ లభిస్తుంది. ఆ తరువాత లైసెన్స్ రెన్యూవల్ సమయంలో తుపాకీ ఉంటే మాత్రమే రెన్యూవల్ చేసుకునే అవకాశం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here