Connect with us

General News

అతను “మొబైల్ నెంబర్” ను “ఆధార్” కు లింక్ చేయగానే..అకౌంట్ లో ఉన్న రూ.1.30 లక్షలు పోయాయి..! ఎలాగో తెలుసా.?

Published

on

వచ్చే ఏడాది ఫిబ్రవరి లోపు మీ మొబైల్‌ నంబర్లను ఆధార్‌తో లింక్‌ చేసుకోండి. లేదంటే మీ మొబైల్‌ నంబర్‌ పనిచేయదు… ఇదీ.. ఇప్పుడు చాలా మంది మొబైల్‌ వినియోగదారులకు రోజూ వస్తున్న మెసేజ్‌. ఈ క్రమంలో పలువురు టెలికాం ఆపరేటర్లు ఈ విషయం పేరిట వినియోగదారులను రోజూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మెసేజ్‌ల వరకు అయితే ఓకే, కానీ మొబైల్‌ నంబర్‌ను ఆధార్‌కు లింక్‌ చేయండి.. అంటూ కాల్స్‌ కూడా చేసి వేధిస్తున్నారు. సరే.. వారు మారరు. కానీ నిజంగా.. ఇలా లింక్‌ చేస్తే ప్రయోజనం ఏంటి..? అనే మాట పక్కన పెడితే.. ఇప్పుడు మేం చెప్పబోయే సంఘటన గురించి వింటే మాత్రం మీ మొబైల్‌ నంబర్‌ను ఆధార్‌కు లింక్‌ చేయడానికి ఒక నిమిషం ఆలోచిస్తారు. అవును, మీరు విన్నది కరెక్టే. ఎందుకంటే విషయం అలాంటిది మరి..! ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…

Advertisement


అతని పేరు శాశ్వత్‌. అతనికి ఓ రోజున మెసేజ్‌ వచ్చింది. అందులో ఏముందంటే… మీ మొబైల్‌ నంబర్‌ బ్లాక్‌ అయింది. దాన్ని కంటిన్యూ చేయాలంటే ఆధార్‌కు లింక్‌ చేసుకోవాలి. కనుక మీ సిమ్‌ ఫోన్‌ నంబర్‌, సీరియల్‌ నంబర్‌లను 121 నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ చేయండి.. అంటూ అచ్చం ఎయిర్‌టెల్‌ కస్టమర్‌ కేర్‌ నుంచి వచ్చినట్టుగానే మెసేజ్‌ వచ్చింది. దీంతో శాశ్వత్‌ ఇది నిజమే అని నమ్మి సదరు నంబర్లను మెసేజ్‌ చేశాడు. అంతే.. క్షణాల్లో అవతలి వారు శాశ్వత్‌ సిమ్‌ను క్లోనింగ్‌ చేశారు. అంటే… అతని సిమ్‌కు డూప్లికేట్‌ సిమ్‌ను తయారు చేశారన్నమాట. అనంతరం ఆ సిమ్‌తో అతని ఐసీఐసీఐ శాలరీ అకౌంట్‌లో ఉన్న రూ.1.30 లక్షలను దోచేశారు. ఆశ్చర్యం… ఇది ఎలా జరిగింది.. అనుకుంటున్నారు కదా… అయితే వివరిస్తాం చూడండి..!

ఈ మధ్య కాలంలో డిజిటల్‌ పేమెంట్‌ మెథడ్స్‌ ఎక్కువయ్యాయి తెలుసు కదా. అనేక రకాల వాలెట్లు యాప్ ల రూపంలో మనకు అందుబాటులో వచ్చాయి. అయితే వాటిల్లో ఐఎంపీఎస్‌, నెఫ్ట్‌ వంటి పేమెంట్స్‌ మెథడ్స్‌తోపాటు యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌) అనే కొత్త పేమెంట్‌ విధానం కూడా మనకు అందుబాటులో ఉంది. దీనికి కేవలం మొబైల్‌ నంబర్‌ ఉంటే చాలు. మన బ్యాంక్‌ వివరాలు ఏమీ ఎంటర్‌ చేయాల్సిన పని ఉండదు. మొబైల్‌ నంబర్‌ను యూపీఐకి అనుసంధానిస్తే యూపీఐ ఇంటర్‌ఫేస్‌ మన మొబైల్‌ నంబర్‌కు కనెక్ట్‌ అయి ఉన్న బ్యాంక్‌ అకౌంట్లను వెదుకుతుంది. ఏదో ఒకటి లింక్‌ అయి ఉంటుంది కనుక కచ్చితంగా అలా లింక్‌ అయిన బ్యాంక్‌ను చూపిస్తుంది. దీంతో బ్యాంక్‌ ఖాతా యూపీఐకి అనుసంధానం అవుతుంది. అలా అయ్యాక ఇక అంతే. బ్యాంక్‌ వివరాలతో సంబంధం లేకుండా నేరుగా యూపీఐ ద్వారా డబ్బును పంపుకోవచ్చు, రిసీవ్‌ చేసుకోవచ్చు. ఇదే నేరగాళ్లకు అవకాశంగా మారింది. ఈ క్రమంలోనే పైన చెప్పిన శాశ్వత్‌ నంబర్‌ కూడా నేరగాళ్ల చేతిలో పడింది. వారు కూడా యూపీఐ ద్వారానే అతని ఖాతాలో ఉన్న రూ.1.30 లక్షలను కాజేశారు.

అయితే శాశ్వత్‌ నిజం తెలుసుకునేసరికి ఆలస్యం అయింది. అయినప్పటికీ లేట్‌ చేయకుండా వెంటనే కస్టమర్‌ కేర్‌కు కాల్‌ చేసి విషయం చెప్పాడు. అనంతరం ఆ బ్యాంక్‌ బ్రాంచ్‌కు వెళ్లాడు. అక్కడ కూడా కంప్లెయింట్‌ ఇచ్చాడు. కానీ ఇప్పటి వరకు ఫలితం లేదు. పైగా శాశ్వత్‌ కంప్లెయింట్‌ ఇచ్చాక 18 గంటల తరువాత కూడా అతని బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి డబ్బులు మాయమయ్యాయి. అతను ఫిక్స్‌ చేసుకున్న ఫిక్స్‌ డిపాజిట్లను కూడా నేరగాళ్లు కాజేశారు. కంప్లెయింట్‌ ఇచ్చాక కూడా ఇలా జరిగిందంటే ఇక ఆ బ్యాంక్‌ ఖాతాదారులకు ఎలాంటి సెక్యూరిటీ కల్పిస్తుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అసలు కంప్లెయింట్‌ ఇవ్వగానే ఆ బ్యాంక్‌ అకౌంట్‌ ఫ్రీజ్‌ అవ్వాలి. కానీ అలా కాలేదు. అంటే అందుకు బ్యాంకే బాధ్యత వహించాలి.

Advertisement

చూశారుగా… మీకు కూడా ఇలాంటి మెసేజ్‌లు వస్తే స్పందించకండి. మీ మొబైల్‌ నంబర్‌ను ఆధార్‌కు అనుసంధానం చేసుకోవాలంటే కచ్చితంగా స్టోర్‌కు వెళ్లాల్సిందే. అంతేకానీ అలా అనుసంధానం చేసుకునేందుకు సదరు కంపెనీలు ఆన్‌లైన్‌లో, మొబైల్‌ ద్వారా ఎలాంటి సదుపాయం కల్పించలేదు. ఇక మరో విషయం ఏమిటంటే… మీ సిమ్‌ కార్డు పోయినా వెంటనే దాన్ని బ్లాక్‌ చేయండి. ఎందుకంటే పైన చెప్పాం కదా. కేవలం మీ మొబైల్‌ నంబర్‌ ఉంటే చాలు, దాంతో బ్యాంకులో ఉన్న డబ్బులు కాజేస్తారు. కాబట్టి ఈ విషయంలోనూ జాగ్రత్త వహించాల్సిందే..!

Advertisement
Continue Reading
Advertisement

Featured

Ambulance: ఘోరం… ఆంబులెన్సులో మహిళకు లైంగిక వేధింపులు.. నిండు ప్రాణాన్ని బలి తీశారుగా?

Published

on

Ambulance: మనకు ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే స్పందించి సరైన సమయంలో చికిత్స అందడం కోసం అంబులెన్స్ కు ఫోన్ చేస్తాం వారు కూడా మన ప్రాణాలను నిలబెట్టడానికి వారి ప్రాణాలను కూడా లెక్కచేయరు కానీ ఓ అంబులెన్స్ డ్రైవర్ తన వృత్తిని మరిచిపోయి అంబులెన్స్ లో ఉన్నటువంటి ఓ మహిళ పట్ల లైంగిక వేధింపులకు దిగారు. దీంతో పేషంట్ గా ఉన్న ఆమె భర్త ప్రాణాలను వదిలిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది.

Advertisement

పూర్తి వివరాలలోకి వెళ్తే..ఈ ఘటన లోరి ఘజిపుర్‌లో చోటుచేసుకుంది. మహిళ భర్త అనారోగ్యంతో బాధపడుతున్న తరుణంలో చికిత్స నిమిత్తం ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. అయితే అక్కడ తగినంత డబ్బు చెల్లించలేకపోవడంతో తిరిగి తన భర్తను ఇంటికి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక ప్రైవేట్ అంబులెన్స్ ను మాట్లాడి తన భర్తను అందులో ఎక్కించి ఇంటికి తీసుకు వెళుతున్నారు.

మార్గమధ్యమంలో అంబులెన్స్ డ్రైవర్ తన హెల్పర్ ఆ మహిళ పట్ల లైంగిక వేధింపులకు గురి చేశారు. తనని ముందు సీట్లో కూర్చోవాలని బెదిరించారు. అంతేకాకుండా ఆమెను లైంగికంగా వేధించడంతో ఆంబులెన్స్ లో ఉన్నటువంటి తన భర్త తన సోదరుడు పెద్ద ఎత్తున అరవడంతో ఆంబులెన్స్ డ్రైవర్ ఆ మహిళ దగ్గర 10000 రూపాయలు విలువ చేసే బంగారం లాక్కొని పేషంటును మార్గమధ్యమంలోనే వదిలేసి ఆక్సిజన్ మాస్క్ కూడా తీసుకొని వెళ్ళిపోయారు.

ఆక్సిజన్ తొలగించి..
ఇలా ఆక్సిజన్ తొలగించడంతో సదరు మహిళ భర్త ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. అప్పటికే వేరే అంబులెన్స్ కు ఫోన్ చేసిన ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన ప్రాణాలను కోల్పోయారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అంబులెన్స్ డ్రైవర్ తీరుపట్ల నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఇలాంటి వారికి కఠినంగా శిక్షించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Vijayawada Floods: విషాదం..నలుగురిని కాపాడాడు… వరదల్లో కొట్టుకుపోయాడు! భార్య 8 నెలల గర్భిణి!

Published

on

Vijayawada Floods: ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలలో కురిసిన వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్లో విజయవాడ మొత్తం నదులను తలపిస్తోంది. భారీగా కురిసిన వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లడంతో విజయవాడ మొత్తం నీటిలో మునిగిపోయింది. దీంతో ఎంతోమంది అవస్థలు పడుతున్నారు.

Advertisement

ఈ వరదల కారణంగా ఎంతో ప్రాణ నష్టం ఆస్తి నష్టం కూడా జరిగింది. సరైన సమయంలో కనీసం తాగడానికి నీళ్లు లేక ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా హృదయ విదారక ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే ఈ వరదలలో ఎంతో మంది ఇతరులను రక్షించి వారు ప్రాణాలను కోల్పోయిన సంఘటనలను మనం చూస్తున్నాము.

కృష్ణలంకకు చెందిన పలిశెట్టి చంద్రశేఖర్‌(32)కు సింగ్‌నగర్‌లో డెయిరీఫాం ఉంది. ఆయనతో పాటు ఇద్దరు సోదరులు మరో ఇద్దరు డైరీ ఫామ్ లో పనిచేసే వర్కర్లు ఈ వరదల్లో చిక్కుకున్నారు. అయితే ఆ నలుగురిని చంద్రశేఖర్ రక్షించారు. ఇక తన ఫామ్ లో 50ఆవులను తాళ్లతో కట్టేసి ఉంటే వాటన్నింటినీ కూడా విడదీసి తాను కూడా సురక్షితంగా బయటకు రావడం కోసం షెడ్ పైకి వెళ్లడానికి ప్రయత్నం చేశారు.

నలుగురికి ప్రాణదానం..
ఇలా షెడ్ పైకి ఎక్కుతున్న సమయంలో కాలుజారి కింద పడటంతో ఆయన వరదల్లో కొట్టుకుపోయి మరణించారు. అయితే తన డైరీ ఫార్మ్ దగ్గరలోనే తన మృతదేహం కనిపించడంతో తన కుటుంబ సభ్యులు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే చంద్రశేఖర్ కు రెండు సంవత్సరాల క్రితం వివాహం కాగా ప్రస్తుతం తన భార్య 8 నెలల గర్భిణీ. ఇలా తమ ప్రాణాలను రక్షించి చంద్రశేఖర్ ప్రాణాలను కోల్పోవడంతో తన సోదరులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

General News

నంద్యాలలో విషాదం.. అర్ధరాత్రి మట్టి మిద్దె కూలి కుటుంబంలో నలుగురు మృతి

Published

on

ఏపీ, నంద్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్న వంగలిలో ఈ ఘటన చోటు చేసుకుంది.. గురువారం అర్థరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికుల సమాచారం. ఈ ఘటనలో తల్లపురెడ్డి గురుశేఖర్ రెడ్డి (45), అతని భార్య దస్తగిరమ్మ (38), వారి ఇద్దరు కుమార్తెలు పవిత్ర (16), గురులక్ష్మి (10) మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి మృతదేహాలను గ్రామస్థులు వెలికి తీస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

Advertisement

సమాచారం అందుకుని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో మృతదేహాలను బయటకు తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు మట్టి మిద్దె కూలి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లను వెంటనే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని గ్రామస్థులకు సూచించారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!