అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒక కీలక ప్రకటన చేసారు. భారత్ కు వెంటిలేటర్లు విరాళంగా ఇస్తామని ప్రకటించారు డోనాల్డ్ ట్రంప్. భారత ప్రధాని నరేంద్రమోడి తనకు ఆప్తమిత్రుడని చెప్పుకొచ్చారు. అదే క్రమంలో కరోనా వ్యాక్సిన్ ను కనుగొనేందుకు భారత్, అమెరికా కలిసి పని చేస్తున్నాయని తెలిపారు.

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో “భారతదేశంలోని మా స్నేహితులకు అమెరికా, వెంటిలేటర్లును విరాళంగా ఇంస్తుందని ప్రకటించడం మాకు గర్వంగా ఉంది. కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా మోడి, మేము కలిసి పని చేస్తున్నాము. మేమిద్దరం కలిసి అజాత శత్రువు అయిన కరోనాను ఓడిస్తాం.” అంటూ ట్విట్ చేసారు డోనాల్డ్ ట్రంప్. అయితే ట్రంప్ చేసిన ఈ ట్విట్ పై భారత్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఒకవైపు చైనా నుంచి వచ్చే కంపెనీలను ఆకట్టుకునేందుకు భారత్ ప్రయత్నిస్తుంటే.. దీనిని ట్రంప్ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారనే వాదన వినిపిస్తుంది. ఇండియాకు వెళ్లేందుకు యాపిల్ కంపెని సన్నాహకాలు చేస్తుంటే.. ఇండియాకు వెళితే ఆ కంపెనీకి పన్ను పోటు తప్పదంటూ వ్యాఖ్యానించారు ట్రంప్. అదే సామయంలో అమెరికాకు వచ్చే కంపెనీలకు పన్ను ప్రోత్సాహకాలు ఉంటాయని చేసిన వ్యాఖల ద్వారా అయన భారత్ కు తీరని ద్రోహం చేస్తున్నారనే వాదన ఆర్దిక వేత్తలనుంచి వెలువడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here