అస్సలు చదువుకోలేదు.. కానీ10 వేలకోట్లు సంపాదించాడు..

0
966

రోజు టీవీ ల్లో కనిపించే అయన..జీవిత గాధ… అందరికి స్ఫూర్తి.. స్కూల్ అంటే తెలీదు బీద కుటుంబం.. పొట్ట చేత పట్టుకుని రాజస్థాన్ నుండి నెల్లూరొచ్చి బంగారం పని చేసే అతనిదగ్గర ….పనిలో చేరి బంగారం గురించి అవగాహన పెంచుకుని ..సొంతం గా నేనెందుకు ఈ business చెయ్యకూడదని తల్లి చేతి గాజులతో ..వస్తువులు చేసి ….వాటిని అమ్ముదామని చెన్నయ్ వెళ్లాడతను.. ఎదురుగా లలితా జ్యాలర్స్ షాప్ కనిపించింది..లలితా లో వాటిని అమ్మి అక్కడ ఆర్డర్స్ తీసుకుని ఇంటికొచ్చిన అతనే ..ఈరోజు టీవీల్లో…ఫ్లెక్సీ ల్లో కనిపించే లలితా జ్యూయలర్స్ అధినేత కిరణ్ కుమార్ ఒకప్పుడు చదవడం, రాయడం రెండూ రాని కిరణ్ కి జ్ఞాపక శక్తే బలం.

లలితా జ్యూయలర్స్ కి 1999లో మూసేసే పరిస్థితి వచ్చింది..అన్నం పెట్టిన సంస్థ మూతపడకుండా లలితా జ్యూయలర్స్‌ను టేకోవర్ చేశారు కిరణ్.. ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో 12 శాఖలపైనే ఏర్పాటు చేసి పదివేల కోట్ల టర్నోవర్ కి లలితా జ్యూయలర్స్ చేరుకోవడం

వెనుక కిరణ్ కృషి ఉంది తాను ఎదగడానికి సమాజమే కారణం అని దాదాపు 12 కోట్ల వ్యయంతో స్వస్థలం (రాజస్థాన్)లో పాఠశాల,hospital నిర్మిస్తున్న కిరణ్.. 2018 తర్వాత తన సంపాదనలో సగాన్ని స్వచ్ఛంద సేవలకు వినియోగించాలని నిర్ణయించుకున్నారు. స్వయం కృషి తో పైకొచ్చిన వ్యక్తి కిరణ్ కుమార్ గురించి చెప్పే ప్రయత్నం మాత్రమే..