ఆడవారు మంగళవారం పొరపాటున తల స్నానం చేస్తే…ఇక అంతే!

0
1500

మాములుగా మగవారు వారం లో ఏ రోజైనా కాని తలస్నానం చేసేస్తారు.అయితే ఒదే విషయం లో మాత్రం ఆడవారికి మగవారికి చాలా తేడా నే ఉంటుంది.అవును ఆడవారు మాత్రం వారం పర్టిక్యులర్ గా కొన్ని రోజులు మాత్రమే తలస్నానం చేస్తారు.అయితే చాలా మంది దీనికి కారణం వారికి జుట్టు ఎక్కువగా ఉండడం వల్ల వారు వారం లో అలా 2,3 రోజులే చేస్తారు అనేది భావన.కాని హిందూ సంప్రదాయం లో మాత్రం దీనికి చాలా పట్టింపులే ఉంటాయి.పండితులు సైతం అందరికి అలానే చెబుతూ ఉంటారు.వారి చెప్పిన దాని ప్రకారం ఈ రోజుల్లో చేస్తే చాలా మంచిది వేరే రోజుల్లో చేస్తే అరిష్టం అని చెప్తారు.అయితే మరి ఏ రోజుల్లో చేస్తే శుభం,ఏ రోజుల్లో చేస్తే అశుభం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే ముఖ్యం గా ఆడవారు బుధవారం,శుక్రవారం తలస్నానం చేస్తే మంచి కలుగుతుందని చెబుతున్నారు.ఈ రెండు రోజుల్లో చేస్తే ఆ ఇంట్లో ఐశ్వర్యం తో పాటు,ఐదోతనం కూడా మెండుగా ఉంటాయట.అలాగే ఆడవారు ఈ రోజుల్లో చేస్తే సుఖమైన జీవనం కొనసాగిస్తారని చెబుతున్నారు పండితులు.అలాగే శనివారం,ఆదివారం కూడా తల స్నానం చేయవచ్చు కాని మిశ్రమ ఫలితాలే లభిస్తాయని పండితులు చెబుతున్నారు,ఈ రోజుల్లో తలస్నానం చేస్తే కొన్ని మంచి ఫలితాలు ,అలాగే కొన్ని అరిష్టాలు కూడా జరిగుతాయని అందుకే ఏదైనా తప్పనిసరి అయితే తప్ప వీలైనంత వరకు చేయకుండా ఉంటే మంచిదని చెబుతున్నారు.ఇక మగవారు మాత్రం బుధవారం,శనివారం మాత్రం తప్పనిసరిగా చేయాలని వారికి మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.అయితే మంగళవారం మాత్రం ఒక్క ఆడవారే కాదు మగవారు కూడా చేయరాదట.ఎందుకంటే దీనివల్ల చాలా అశుభాలు ఉన్నాయట.ఈ రోజు చేస్తే అసలు కలసిరాదట.

అంతేకాదు పొరపాటున చేసినా కాని ఏ పని తలపెట్టినా కాని కల్సిరాకపోవడం ,ఏదైనా ప్రారభించే ముఖ్యమైనా కార్యక్రమం కూడా మంచి ఫలితాలను ఇవ్వదుట.సోమవారం తలస్నానం చేస్తే పాపం పెరుగుతుంది.పురుషులు శుక్రవారం మాత్రం అస్సలు తలస్నానం చేయరాదుట.అయితే పండితులు చెపుతున్న దాని ప్రకారం ఆరోజుల్లో కూడా మినగయింపు ఉన్నదట.పుట్టిన రోజు,పండుగ రోజు,ఏవైనా శుభకార్యాలు అయితే చేయవ్చ్చట.కాబట్టి ఏరోజు తలస్నానం చేస్తే మంచిదో తెలుసుకుని ఆరోజు చేస్తే మంచిదని చెబుతున్నారు.