‘ది లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్’ ద్వారా రాఘవ లారెన్స్ సామాజిక కార్యక్రమాలు చేస్తున్న సంగతి మనందరికి తెలిసిందే. జల్లికట్టు వివాదంలో తన వంతు సపోర్ట్ అందించిన రాఘవ లారెన్స్ , ఇటీవల ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్ధి అనిత కుటుంబానికి 15 లక్షలు సాయం చేసి, తన గొప్ప మనసుని మరోసారి నిరూపించుకుని…అందరి మనన్ననలు పొందారు. అంతేకాదు ‘ది లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్’ ద్వారా రాఘవ లారెన్స్ ఇప్పటికి ఎంతో మంది పిల్లలకి ఉచితంగా ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయించారు. ఇప్పటి వరకూ ఆయన తన ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా 141 మంది చిన్నారులకు ఉచితంగా ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయించారు.

సామాజిక కార్యక్రమాలలో ఎప్పుడు ముందు ఉండే లారెన్స్.. ది లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. ఇప్పటివరకు 140 చిన్నారులకి ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయించారు. తాజాగా శివాని అనే పాప హార్ట్ లో హోల్ ఉండటంతో ఆ పాపకి ఆపరేషన్ చేయించాడు. మా 141వ ఓపెన్ హార్ట్ సర్జరీ సక్సెస్ అయింది. ఒక ఏడాది వయసు ఉన్న శివాని అనే పాప.. హార్ట్‌లో హోల్ ఉండటంతో ఆపరేషన్ నిర్వహించాము. పాప ప్రస్తుతం హాస్పిటల్ నుంచి క్షేమంగా ఇంటికి వెళ్లిపోయింది. ఈ ఆపరేషన్లు నిర్వహిస్తున్న డాక్టర్ల బృందానికి థ్యాంక్స్ చెబుతూ..ఆ పాప ఆపరేషన్ సక్సెస్ అయినందుకు తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు లారెన్స్ .

అంతేకాకుండా ఇంకెవరైనా అలాంటి ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడుతుంటే ఈ 09790750784, 09791500866 నంబర్ల ద్వారా మా ట్రస్ట్ ని కాంటాక్ట్ చేయండి.’ అని తన ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేశాడు లారెన్స్. చిన్నారులకు ఆయుశ్షు పోస్తున్న లారెన్స్ నిండు నూరేళ్ళు ఆయుశ్శుతో బాగుండాలని ప్రతీ తల్లితండ్రులు కోరుకుంటున్నారు. మనం లారెన్స్ అంత గొప్ప పని చేయలేకపోయినా, కనీసం ఈ విషయాన్ని అందరికి తెలియజేసి, ఆ మంచి పనిలో మనం కూడా ఒక చేయి వేద్దాం…షేర్ చేసి అందరికి చేరేలా చేయండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here