మెంతులను నీటిలో నానబెట్టి ఆ నీటిని పడేయకుండా జుట్టుపై పోసుకోవచ్చు ఆ నానిన మెంతులను పేస్ట్ చేసి దాంట్లో కొద్దిగా పెరుగు వేసి కలిపి ఆ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయాలి అది ఆరిన తరువాత జుట్టును కడిగేయాలి ఇలా చేయడం వలన జుట్టు నల్లగా మారుతుంది అలాగే ఇది జుట్టుకు మంచి కండిషనర్ లా పనిచేస్తుంది. ఆవ నూనెను వేడి చేసి దాంట్లో కొంచెం మెంతులపొడి వేసి వేడయ్యాక ఆ నూనెను ఒక సీసాలో భద్రపరచుకోవాలి ప్రతీ రోజూ జుట్టుకు అప్లై చేయడం వలన జుట్టు నల్లబడుతుంది అలాగే కుదుళ్లు గట్టిపడతాయి అలాగే రక్తప్రసరణ బాగా జరుగుతుంది.మంచి పోషకాలు జుట్టుకు అందుతాయి.

కొబ్బైరి నూనెలో ఉసిరి పొడి వేసి బాగా మరిగించి ఆ నూనెను ఒక గాజు సీసాలో భద్రపరచి ప్రతిరోజూ జుట్టుకు అప్లై చేయడం వలన తెల్లని జుట్టు నల్లగా మారుతుంది.క్యారెట్ జ్యూస్ లో కొద్దిగా నువ్వులనూనె కలిపి ఆ మిశ్రమాన్ని జుట్టుకు ఒక 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో తల స్నానం చేయాలి దీనివలన జుట్టు నల్లగా మారుతుంది.కొబ్బరి నూనె లో నిమ్మరసం కలిపి తరచూ జుట్టుకు అప్లై చేసి తలస్నానం చేయడం వలన కూడా జుట్టు నల్లగా కాంతివంతంగా మారుతుంది.పచ్చి కరివేపాకు లో కొద్దిగా మజ్జిగ కలిపి పేస్ట్ చేసి జుట్టుకు అప్లై చేసి కడిగేయాలి ఇలా రెగ్యులర్ గా కొద్దిరోజుల పాటు చేయడం వలన జుట్టు నల్లగా సిల్కు గా మారుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here