వ్యక్తి పొడవును బట్టి కూడా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తెలుసుకోవచ్చు అంటుంటారు. అయితే, పుట్టుకతోనే దేవుడు ఇచ్చిన ఎత్తును మార్చుకోవడం అన్నది అంత సులభం కాదు. సాధారణంగా పుట్టినప్పటి నుంచి మగవారిలో 18 ఏళ్ల వరకు, ఆడవారిలో 16 సంవత్సరాల వరకు ఎముకల్లో పొడవు పెరుగుదల ఉంటుంది. పెరిగే వయసులో ఎముకల్లోని ముఖ్యభాగాలు మూడు అవి… ఎపిఫైసిస్, డయాఫైసిస్, మెటాఫైసిస్. ఈ చిత్రంలో చూపినట్టు ప్రతి ఎముకలోను కింద భాగానా, పైభాగాన కల రెండు మెటాఫైసిస్ యూనిట్లలో పెరుగుదలకు సంబంధించిన కణజాలం ఉంటుంది. దీన్ని గ్రోత్‌ప్లేట్ అంటారు.
ఈ కణజాలం ప్రతి వ్యక్తిలోను తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన (జీన్స్) అనువంశిక లక్షణాలకు లోబడి వ్యక్తి పొడవు నిర్ణయమవుతుంది. అంటే మనిషి ఎత్తు మూలకాలు జీన్స్‌ద్వారా నిర్ణయమవుతాయి. కొంతవరకు ఆహార పోషక పదార్థాలు మనిషి ఎత్తు పెరుగుదలను ప్రభావితం చేస్తాయి. అంతేకానీ రకరకాల వ్యాపార ప్రకటనలతో మోసపోయి ఎక్కువ ఎత్తు పెరగడం అనే అపోహను వదులుకోవాలి.