ఈటీవీ సీరియల్స్ హీరోయిన్స్ ఏం చేస్తున్నారో ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా.. వీళ్ళు నిజంగా గ్రేట్..

0
2374

టైం అయ్యిందంటే చాలు ప్రపంచాన్నే మరిచిపోయి టీవీ ముందు వాలిపోతారు. ఇంట్లో ఏం జరిగినా పట్టించుకోరు. ఒకవేళ ఆ టైం లో కరెంట్ పోయిందంటే ఏం జరుగుతుందో అన్న టెన్షన్. టీవీ సీరియల్స్ కు అంతగా అతుక్కుపోతున్నారు కొందరు మహిళలు. ఎంతలా అంటే సీరియల్స్ కి ఆడవారికీ మధ్య విడదీయరాని బంధం ఉందని అనేంతగా తయారయ్యారు. సీరియల్స్ వచ్చే టైంలో ఇంట్లో వాళ్లని పట్టించుకోవడమే మానేస్తున్నారు కొందరు. ఇదీ అదీ అనే తేడా లేదు. ఏ సీరియల్ నీ వదలకుండా చూస్తున్నారు మరికొందరు. సాయంత్రమైతే చాలు 90 శాతం ఆడవాళ్ళు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి వరకూ రెస్ట్ లేకుండా ఏదో ఒక సీరియల్స్ చూసే వాళ్ళూ ఉన్నారు. సీరియల్స్ వచ్చే పాత్రల్లో పూర్తిగా లీనమై టైంను కూడా మర్చిపోతుంటారు కొందరు. అయితే అప్పట్లో సీరియల్స్ చాలా బాగా బాగా ఉండేవి. తెలుగు ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో ఇప్పుడు ఈటీవీ గట్టి పోటీనిస్తుంది . కొంతకాలంపాటు నెంబర్ వన్ స్థానంలో నిలబడినప్పటికీ ఈ మధ్య కాలంలో కాస్త వెనకబడి ఈటీవీకి గట్టి పోటీగా తయారైన చాలా చానెల్స్ ఉన్నాయి . ఈ చానల్స్ లో ప్రసారమయ్యే సీరియల్స్ కన్నా ఈటీవీ సీరియల్స్ కే ఎక్కువగా ప్రజాదరణ పొందుతున్నాయి. ఈటీవీ లో మధుర జ్ఞాపకాలుగా మిగిన పోయిన ఆ సీరియల్స్ ఏవో ఇప్పుడు చూదాం.

లేడీ డిటెక్టివ్


ఈటీవీ మొదలైన కొత్తలో మొదలైంది ఈ సీరియల్. సినీ దర్శకుడు వంశీ డైరెక్షన్ లో మొదటి టివి సీరియల్..ఈ సీరియల్ ఈటీవీ లో ప్రతి మంగళ వారం రాత్రి 8 :30 నుండి 9 వరకు ప్రసారం ప్రసారమైఏది. ఈ సీరియల్ లో నటించిన హీరోయిన్ ఉత్తర చాల బాగా నటించి అందరి ప్రశంశలు అందుకుంది. ఆ తర్వాత ఉత్తర ఈ ఒక సీరియల్ తో స్టాప్ చేసి పెళ్లి చేసుకొని రియల్ లైఫ్ లో బిజీ అయిపోయింది.

స్నేహ సీరియల్

ఈటీవీ సీరియల్స్ లో ఒకానొక బెస్ట్ సీరియల్ స్నేహ. ఈ సీరియల్ కూడా బాగా ప్రేక్షాధారణ పొందింది . స్నేహ సీరియల్ లో నటించిన నటి కూడా ఈ సిరిల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత పెళ్లి చేసుకొని ఈవిడ కూడా లైఫ్ లో బిజీ అయిపోయింది.

అన్వేషిత సీరియల్

ఈ సీరియల్ థ్రిల్లర్ తో కూడిన టెలివిజన్ సీరియల్. ఇందులో అచ్యుత్ , యమునా మెయిన్ రోల్స్ చేసారు. తెలుగు భాషలో విడుదలైన ఈ సీరియల్, ఆగష్టు 27, 1997 న ETV తెలుగులో ప్రదర్శించబడింది. ఈ సీరియల్ మొత్తం 100 ఎపిసోడ్స్ , 1999 లో దాని చివరి ఎపిసోడ్ ప్రసారం చేసిన సమయానికి, తెలుగు ప్రేక్షకుల మధ్య చాలా ప్రజాదరణ పొందింది. వివిధ విభాగాలలో ఎనిమిది నంది అవార్డులు కూడా వచ్చాయి. అచ్యుత్ ఒక తెలుగు టెలివిజన్ మరియు సినీ నటుడు. ఇతను తెలుగు దూరదర్శిని మరియు సినిమాలలో అనతికాలంలో మంచి పేరు సంపాదించిన నటుడు. చిన్న ప్రాయంలోనే గుండెపోటుతో హఠాత్తుగా మృతిచెందాడు.. ఇక్క నటి యమునా ఇప్పటి కూడా ఈటీవీ సీరియల్ లో నటిస్తుంది.

అంతరంగాలు సీరియల్

అంతరంగాలు ఈటీవీ లో చాలాకాలం జనరంజకంగా కొనసాగిన తెలుగు ధారావాహిక. దీనికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, బొమ్మలు మరియు దర్శకత్వ పర్యవేక్షణ చెరుకూరి సుమన్. దీనిని రామోజీరావు నిర్మించగా అక్కినేని వినయ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సీరియల్ లో శరత్ బాబు , కల్పనా , అచ్యుత్ లీడ్ రోల్స్ పోషించారు. శరత్ బాబు ఒక విలక్షణమైన తెలుగు సినిమా నటుడు. తమిళ, తెలుగు, కన్నడ సినీ రంగాలలో 220కి పైగా సినిమాలలో నటించాడు. కథానాయకుడుగానే కాక, ప్రతినాయకుని పాత్రలు, తండ్రి పాత్రలు వంటి విలక్షణ పాత్రలు పోషించాడు. నటి కల్పనా ఈ సీరియల్ తర్వాత మరికొన్ని సీరియల్స్ , సినిమాల్లో కూడా నటించింది. పెళ్లి తర్వాత ఇటు బుల్లి తెర అటు వెండి తెర కు దూరం గా ఉంటూ పర్సనల్ లైఫ్ లో బిజీ గా ఉంటుంది.

ఎండమావులు సీరియల్

ఈ సీరియల్ ఈటీవీ లో బాగా ప్రజా ఆదరణ పొందింది. ఈ సీరియల్ లో మహర్షి, జ్యోతి రెడ్డి మెయిన్ లీడ్ రోల్స్ చేసారు. మహర్షి రాఘవ 170 కి పైగా సినిమాలలో నటించాడు. వంశీ దర్శకత్వంలో వచ్చిన మహర్షి అనే సినిమాలో కథానాయకుడిగా నటించి, ఆ సినిమా విజయవంతం కావడంతో ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా చేసుకున్నాడు.ఇప్పటికి టీవీ సీరియల్స్ లో కూడా నటిస్తున్నాడు.

ఇలా చూసుకుంటూ పోతే ఈటీవీ లో చాల సీరియల్స్ మధుర జ్ఞాపకాలుగా ప్రజల గుండెల్లో నిలిచిపోయాయి..