ఈ ఆగస్ట్‌లో సెలవులే సెలవులు
ఈ ఆగష్టు నెలలో పని తక్కువ.. సెలవులు ఎక్కువ. లాంగ్ వీకెండ్స్‌తో పండగ చేసుకోవచ్చు. లాంగ్ టూర్ ప్లాన్ చేసుకోవాలనుకునే వారికి ఆగస్ట్ మంచి చాన్స్ ఇస్తున్నది. రానున్న వీకెండ్‌తో ప్లాన్ మొదలుపెట్టండి.
ఈ శుక్రవారం వరలక్ష్మీవ్రతం. ఆ తర్వాత వీకెండ్. మళ్లీ సోమవారం (ఆగస్ట్ 7) రక్షాబంధన్. మళ్లీ 12, 13 తేదీల్లో వీకెండ్ కాగా.. 14వ తేదీన జన్మాష్టమి, అంటే వరుసగా మూడు రోజులు హాలిడేస్. ఇక ఆగస్ట్ 25న అంటే శుక్రవారం వినాయక చవితి. ఆ తర్వాత రెండు రోజులు వీకెండ్. సాధారణంగా ఐటీ, బ్యాంకింగ్ (రెండు, నాలుగో శనివారాలు) సెక్టార్లలో ఉన్న వారికి శనివారాలు కూడా హాలిడేసే. మిగతా సెక్టార్లలో ఉన్నవాళ్లు కూడా ఆ ఒక్క రోజు లీవ్ పెట్టేస్తే అన్న ఆలోచనలో ఉంటారు కాబట్టి.. ఈ నెలంతా లాంగ్ వీకెండ్స్‌తో లాంగ్ టూర్లు వేసి ఫుల్లుగా ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోతున్నారు, మీరు కూడా టూర్స్ కి ప్లాన్ చేసుకోండి.