జీవితమంటే అంతే. కష్టాలు, సుఖాలు, కన్నీళ్లు, ఆనందాలు.. ఎత్తు, పల్లాలు అన్నీ అందులో ఉంటాయి. అన్నింటినీ మనిషి అనుభవిస్తాడు. అవసాన దశలో వైరాగ్యం బాట పడతాడు. చివరకు జీవిత అంకం ముగుస్తుంది. అయితే సాధారణంగా చాలా మంది జీవిత చరమాంకంలో వైరాగ్యం బాట పట్టి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కానీ ఇప్పుడు మేం చెప్పబోయే కొందరు సెలబ్రిటీలు మాత్రం జీవితం ఇంకా చాలా మిగిలి ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక బాట పట్టారు. కొందరు అందులో విజయవంతంగా ముందుకు సాగుతుంటే కొందరు మాత్రం దానికి బ్రేకులు వేసి తిరిగి యథాతథ జీవితం కొనసాగిస్తున్నారు. అలా ఆధ్యాత్మిక బాట పట్టిన పలువురు సెలబ్రిటీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. మనీషా కొయిరాలా
తెలుగులోనే కాదు, అనేక భాషల్లోనూ మనీషా కొయిరాలా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈమెకు అండాశయ క్యాన్సర్ సోకింది. దీంతో సినీ రంగానికి దూరమైంది. అయితే చికిత్స తీసుకుని కోలుకున్నాక ఈమె ఆధ్యాత్మిక బాట పట్టింది. 2016లో ఉజ్జయినిలో సాధ్విగా మారింది. అయినప్పటికీ ఈమె పలు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తుండడం విశేషం.
2. సోఫియా హయత్
బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొని అందరి దృష్టినీ ఆకర్షించింది సోఫియా హయత్. ఈమె ఓ బ్రిటిష్ మోడల్. సింగర్, యాక్టర్‌గా కూడా రాణించింది. అయితే ఈమె గతంలో సన్యాసినిగా మారి అందరినీ షాక్‌కు గురి చేసింది. కానీ ఆ జీవితానికి స్వస్తి చెబుతూ మళ్లీ ఈమె పెళ్లి చేసుకుని యథాతథ జీవితాన్ని గడుపుతోంది.
3. మమతా కులకర్ణి
ఈమె ఒకప్పుడు మంచి నటిగా గుర్తింపు పొందింది. తరువాత సన్యాసినిగా మారింది. ఈ క్రమంలో తన గురించి ఓ ఆటోబయోగ్రఫీ పుస్తకాన్ని రాసుకుంది. Autobiography Of An Yogini పేరిట ఆ బుక్‌ను విడుదల చేసింది. అయితే ఈమె, ఈమె భర్త ఇద్దరూ. రూ.2వేల కోట్ల డ్రగ్ స్కాంలో ఇరుక్కున్నారు. ఈ ఏడాది జూన్ 2017లో థానే కోర్టు వీరిని దోషులుగా ప్రకటించింది.
4. బర్కా మదన్
ఈమె కూడా పలు సినిమాల్లో నటించి నటిగా గుర్తింపు పొందింది. అయితే బౌద్ధ గురువు దలైలామా ప్రవచనాల పట్ల ఈమె ఆకర్షితురాలైంది. దీంతో ఆమె 2012లో బుద్ధిజం తీసుకుంది. సన్యాసినిగా మారింది. Ven Gyalten Samten అనే పేరు పెట్టుకుంది. అప్పటి నుంచి బర్కా మదన్ సన్యాసి జీవితాన్ని గడుపుతోంది.
5. సుచిత్రా సేన్
ఈమె 25 ఏళ్ల పాటు నటిగా రాణించింది. అయితే ఇంట్లో నెలకొన్న అశాంతి కారణంగా ఈమె దృష్టి ఆధ్యాత్మికత వైపు మళ్లింది. రామకృష్ణ మఠంలో చేరింది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంది. స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడిచింది. 2014 జనవరి 17న ఈమె తన 84వ ఏట మరణించింది.