ఈ కార్తిక సోమవారం సాయంత్రం మీరు ఈ ఒక్క పని చేస్తే ఇంకా మీ అదృష్టానికి తిరుగు ఉండదు..

0
1598

కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉంటే చిత్తశుద్ధితో స్నానమాచరించి దానము, పితృశ్రాధ్దము, దేవతార్చనలు చెయ్యటం ద్వారా అనంత పుణ్యఫలములు చేకూరుతాయి. సూర్యుడు తులారాశిలో ప్రవేశించిన నాటినుంచి గానీ, కార్తిక శుద్ద పాడ్యమి నుంచి వ్రతాన్ని ఆచరించాలి.

విష్ణువు ఈ కార్తీక మాసంలో గోమాత కాలిడిన చోటులో ఉంటాడని మన శాస్త్రాలు తెలుపుతున్నాయి. అంతేగాక నూతులు, చెరువుల్లో మహావిష్ణువు వెలసియుంటాడని ప్రతీతి. ఈ సమయంలో శుచిగా స్నానమాచరించి కాలభైరవున్నిధ్యానించటం చేస్తే మంచి పుణ్య ఫలితాలు లభిస్తాయి.

పుష్పాలతో భక్తి భావములతో పూజించి భుజించాలి. సాయంకాలం శివ,విష్ణు ఆలయాల్లో దీపం పెట్టండటం చేయాలి. వీలైన వారు విష్ణుసోత్రమును గానీ, శివ సోత్రమునుగానీ చదివి ధ్యానించటం చెయొచ్చు. ఈ విధంగా కార్తికమాసంలో భక్తిపరంగా స్నానమాచరించే వారికి మరుజన్మ లేదని మోక్షం లభిస్తుందని విశ్వాసం. ఈ జన్మలో మాత్రమే కాకుండా పూర్వపు జన్మల్లో చేసిన పాపాలు తొలగిపోతాయి.