ఈ టాలీవుడ్‌ హీరో రీల్‌ లైఫ్‌, రియల్‌ లైఫ్‌ వైఎస్‌ఆర్‌ మరణంతో నాశనం అయ్యింది..

0
828

ఆనంద్‌’ సినిమాను చూడని వారు ఉండరు. మంచి కాఫీలాంటి సినిమా అంటూ ట్రెండ్‌ సెట్‌ చేసిన ఆ సినిమా ఇప్పటికి టీవీల్లో వచ్చినా కూడా ప్రేక్షకులు తెగ చూసేస్తూనే ఉంటారు. ఆ సినిమా శేఖర్‌ కమ్మల దర్శకత్వంతో పాటు రాజా సింపుల్‌ యాక్టింగ్‌ వల్ల సక్సెస్‌ అయ్యింది..

ఆ సినిమాలో రాజా చాలా న్యాచురల్‌గా నటించి మెప్పించాడు. ఆ సినిమాకు ముందు రాజా పలు సినిమాల్లో నటించి హీరోగా నిలదొక్కుకున్నాడు. ‘ఆనంద్‌’ సక్సెస్‌తో రాజాకు మరిన్ని ఆఫర్లు వచ్చాయి. ఆ సమయంలోనే సంబంధం ఎలా కలిసిందో కాని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డితో పరిచయం ఏర్పడటం జరిగింది.