ఇద్దరు స్నేహితులు బుధవారం మెట్రోలో అమీర్‌పేట నుంచి మియాపూర్‌కు బయలు దేరారు. స్మార్ట్ కార్డు కొనుగోలు చేసి ఎలక్ట్రానిక్ గేటు వద్ద స్వైప్ చేసి మెట్రో ఎక్కారు. మియాపూర్‌కు వెళ్లారు. అక్కడ ప్లాట్‌ఫాం మీద కాసేపు గడిపి తిరిగి మెట్రోలో అమీర్‌పేట చేరుకున్నారు. మెషిన్ వద్దకు వచ్చి స్మార్ట్ కార్డు స్వైప్ చేయగానే పది రూపాయల జరిమానా పడినట్టు చూపించింది. ఎందుకు అలా వచ్చిందని స్నేహితులు ఆరా తీయగా ప్లాట్‌ఫాంలో అరగంట అంతకు మించి ఉంటే ఛలానా పడుతోందని చెప్పారు. ఇక్కడ స్నేహితులు మియాపూర్ వరకు వెళ్లి వచ్చినందుకు అయ్యే చార్జి మాత్రం పడలేదు.
అబ్బా ఇలా చేస్తే భలేవుందంటూ ఇద్దరు ఎస్కలేటర్ మీదుగా కిందకు చేరుకున్నారు. మెట్రోలో ప్రయాణించే వారు గమ్యస్థానానికి చేరుకున్నాక ఎగ్జిట్ వద్ద కార్డు స్వైప్ చేయగానే స్మార్ట్ కార్డులో అప్పటి వరకు అయిన చార్జి బ్యాలెన్స్‌లో కట్ అవుతోంది. ఎగ్జిట్ వద్ద స్వైప్ చేయకుండా తిరిగి బయలు దేరిన స్టేషన్‌కు వెళ్తే స్మార్ట్ కార్డులో చార్జి చూపించడం లేదు. దీంతో ఇదేదో బాగుంది కదా అనుకుంటూ నగర వాసులు స్మార్ట్ కార్డులు కొనుగోలు చేసి జాలీగా షికారు చేశారు. ఇలా..