ఈ నదిలో బంగారం దొరుకుతుంది.. పరుగులు పెడుతున్న జనం

0
1257

గంగానది భారతదేశంలోను, బంగ్లాదేశ్‌లోను ప్రధానమైన నదులలో ఒకటి. హిందూమతంలో గంగానదికి ఉన్న ప్రాముఖ్యత అత్యున్నతమైనది. “గంగమ్మ తల్లి” అనీ, “పావన గంగ” అనీ, “గంగా భవాని” అనీ ఈ నదిని హిందువులు స్మరిస్తారు. “నీరు” అన్న పదానికి సంస్కృతంలో “గంగ” అన్న పదాన్ని వాడుతారు. మన భారతదేశం అనేక రకాల విశేషతలను కలిగివుంది. ఇక్కడ మనం రెండు అద్భుతాలను గురించి తెలుసుకుందాం.

మన దేశంలో గంగానది ఎన్నో రకాల ప్రత్యేక గుణాలను కలిగి ప్రపంచంలో మరే నదికి లేనటువంటి విశిష్టతలను ఆ నది కలిగివుంది. సామాన్యంగా అన్ని నదులలో ఇసుకరేణువులు వుంటాయి. కానీ ఈ నదిలో మాత్రం ఇసుకరేణువులుతో పాటు బంగారు రేణువులు కూడా వుంటాయి. ఇది నిజమే.

కొన్ని వేల సంవత్సరాల నుండి ఇక్కడ బంగారం అనేది లభిస్తుంది. అయితే ఇసుక రేణువులలో బంగారం లభించడం అనే దానికి ఖచ్చితమైన ప్రమాణాలు అనేవి ఏవీ లేవు.

కానీ వైజ్ఞానికపరమైన కారణాలు పరిశీలిస్తే మాత్రం ఈ నది అనేక రకాలైన కొండలు, పర్వతాలు దాటుతూ వస్తుంది కావున ఆ సంఘర్షణ వలన బంగారురేణువులు ఉత్పన్నం అయివుంటాయని భావిస్తున్నారు. మరి ఈ నది ఎక్కడ వుంది? దాని వివరాలు గురించి తెలుసుకుందాం.

ఈ నది జార్ఖండ్ రాష్ట్రంలో పశ్చిమబెంగాల్ లో ఒరిస్సాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ప్రవహిస్తుంది. కేవలం ఈ నదిలో మాత్రమే ఇలాంటి బంగారురేణువులు లభిస్తాయి. ఆ నదిని స్వర్ణరేఖ, సువర్ణ రేఖ అని కూడా అంటారు.

చేపల కోసం కాకుండా బంగారం కోసం వలలు వేస్తూ వుంటారు. దీనిపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. అందుకే పూర్వకాలంలో భారతదేశాన్ని సోనీకిచిడా అని పిలిచేవారు.నదిలో కూడా బంగారం లభిస్తుంది అంటే అది నిజమేనేమో అనిపిస్తుంది. మన దేశంలో ఎన్నో పవిత్రనదులు, జీవ నదులు వున్నాయి. జీవాధారానికి ప్రాణం పోసే నీరు ఈ నదులద్వారానే లభ్యమౌతున్నాయి. ఈ స్వర్ణ రేఖని అక్కడి ఆదిమవాసులు నందా అని పిలుస్తారు.

అక్కడి ఆదివాసులు బంగారంకోసం నదిలోని ఇసుకను మొత్తం జల్లెడ పట్టేస్తారు. వారి జీవితాలు అందులోని బంగారాన్ని వెలికితీయడంలోనే వేల సంలుగా గడుస్తూ వున్నాయి.

ఇక వీరు ఈ బంగారాన్ని లోకల్ వ్యాపారులకు అమ్మివేస్తారు. అయితే వీరి ద్వారా కోట్లు గడిస్తున్న వ్యాపారులు మాత్రం వీరికి మాత్రం కొంత మొత్తాన్ని మాత్రమే అప్పజెప్పుతారు. ఇక జార్ఖండ్ లోని రాజధానియైన రాంచికి 15కి.మీ ల దూరంలో స్వర్ణరేఖ నది ప్రవహిస్తుంది. రత్నగర్భ అనే ప్రాంతంలో ముఖ్యంగా ఈ బంగారు రేణువులు అనేవి లభ్యం అవుతాయి.