ఈ మిశ్రమం రాస్తే నడుము నొప్పి జన్మలో రాదు ఎలానో తెలుసుకొని అందరికి తెలియజేయండి.

0
2262

నడుము నొప్పి కి చిట్కాలు

కొందరికి తరచూ వెన్ను నొప్పి బాధిస్తూ ఉంటుంది. బ్యాక్ పెయిన్ కు వివిధ రకాల కారణాలున్నాయి. బ్యాక్ పెయిన్ కు చిన్న సమస్యల నుండి పెద్ద సమస్యల వరకూ కారణాలే. కూర్చొనే భంగిమ సరిగాలేప్పుడు లేదా ఎక్కువ సమయం కూర్చొని పనిచేయడం, తీవ్రమైన వ్యాయామాలు చేయడం, యాక్సిడెంట్స్, రోజులో ఎక్కువసేపు బైక్ డ్రైవ్ చేయడం వంటివి బ్యాక్ పెయిన్ కు కారణాలవుతున్నాయి. ఏది ఏమయినా ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా నడుం నొప్పి (బ్యాక్ పెయిన్) వచ్చి తెగ ఇబ్బంది పెడుతోంది. దీనికి చక్కని సహజ సిద్ధమైన ఖర్చు లేని చిట్కాలు మీకోసం..

చిట్కాలు:

*కొద్దిగా అల్లం తీసుకుని పేస్ట్ లా చేసుకుని నడుం నొప్పి ఉన్న చోట రాయాలి. 20 నిమిషాలసేపు ఉంచి తర్వాత కడిగేయాలి. ఇలా తరచుగా చేస్తూ ఉంటే నడుం నొప్పి తగ్గుముఖం పడుతుంది.

*దీనికి కొన్ని అల్లం ముక్కలు, తేనె కావాలి. ముందుగా ఓ బౌల్ లో వాటర్ వేసుకుని స్టవ్ పై ఉంచి బాయిల్ చేస్తూ ఉండాలి. అందులో అల్లం ముక్కలు వేసి కాసేపు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ అల్లం రసం కొద్దిగా చల్లారిన తర్వాత కొద్దిగా తేనె వేసుకుని తాగితే నడుం నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది కూడా పరగడపున తాగాలి. రెగ్యులర్ గా చేస్తే నొప్పి తగ్గుముఖం పడుతుంది.

*వెల్లుల్లి పేస్ ను ఓ గ్లాస్ వాటర్ లో కరిగించుకుని తాగాలి. ఇలా తరచుగా చేస్తూ ఉంటే నడుం నొప్పి నుంచి రిలీఫ్

*పసుపు, అల్లం రసం, పాలు కావాలి. గోరువెచ్చని పాలలో కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం రసం బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఆ పాలను పరగడపున తాగితే బెస్ట్ రిజల్ట్ వస్తుంది.

*ఆవనూనె, నువ్వుల నూనె రెండూ సమాపాళ్లలో తీసుకుని నడుం నొప్పి ఉన్నచోట మర్దన చేయాలి. తరచుగా ఇలా చేస్తూ ఉంటే నొప్పి మటుమాయం.

*శొంటి గంథాన్ని తీసుకుని నడుం పై భాగాన పట్టీలా రాసుకోవాలి. అలా కాసేపు ఉంచితే నొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది.

*నిటారుగా కూర్చుని డ్రైవింగ్ చేయాలి. వెన్నును వంచకుండా కూర్చోవడం వల్ల వెన్ను, నడుం నొప్పులు తగ్గుముఖం పడతాయి. రెండు పాదాలు కింద ఆనేలా కుర్చీలో కూర్చోవాలి.

*వెన్నుపూసకు బలాన్నిచ్చే మినపప్పు రెగ్యులర్ గా తినాలి. వారానికి రెండు సార్లయినా మినప్పప్పుతో చేసిన ఆహారం తినాలి. రోజువారీ డైట్ ఈ పప్పు ఉండేలా చూసుకుంటే వెన్నుపూసకు సరైన పోషకాలంది బలోపేతం అవుతుంది.

*కొబ్బరినూనెలో కర్పూరం బిళ్లలు వేసి బాగా కరిగిన తర్వాత నడుం నొప్పి ఉన్న చోట రాస్తే దెబ్బకు రిలీఫ్ వస్తుంది.

*పల్చటి మజ్జిగలో కొద్దిగా సున్నం తేటను కలిపి పరగడపున తాగాలి.

*కొబ్బరినూనె, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలో కొబ్బరినూనె వేసి ఉంచుకోవాలి. దంచి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లిపాయలను అందులో వేసుకోవాలి. బాగా మరిగిపోయాక పక్కన పెట్టుకోవాలి. ఈ ఆయిల్ నడుం నొప్పి ఉన్నచోట రాసుకోవాలి. అల్లంలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నడుం నొప్పిని నివారిస్తాయి.

*తులసి ఆకులు, రాళ్ల ఉప్పు తీసుకోవాలి. ముందుగా ఒక బౌల్ లో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. అందులో తులసి ఆకులు వేసుకుని తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ నీటిని రోజూ పరగడపున తాగితే నడుం నొప్పికి చక్కటి పరిష్కారం. తులసి ఆకుల్లో ఉన్న ఆయుర్వేద గుణాలు నడుం నొప్పిని తిప్పికొడతాయి.

ఇందులో ఏ ఒక్కటి క్రమం తప్పకుండా ఆచరించినా మీ నడుం నొప్పి త్వరలోనే తగ్గుముఖం పడుతుంది. అంతేకాదు సహజసిద్ధమైన మార్గంలో నడుం నొప్పిని తగ్గించుకుంటే తిరిగి మళ్లీ రాదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.