ఈ హిజ్రా ఏ టాప్ హీరోతో నటిస్తుందో తెలుసా ?ఇందుకోసం ఎంత కష్ట పడిందో తెలిస్తే బాద పడతారు

0
1274

నిజంగా కొన్ని సంధర్బాలలో మనం మంచివారమైనా మానవత్వం మరిచి ప్రవర్తిస్తుంటాం..”ఆ” మనిషి ఎదురుకాగానే చిన్న చూపు చూస్తాం.. ఎందుకో మనం పెంచుకునే కుక్కలు,పిల్లులాంటి వాటిపై చూపించే ప్రేమ సాటి మనిషి విషయంలో చూపడానికి సిగ్గుపడుతుంటాం.అలాంటి వ్యక్తి మన ఇంట్లో వ్యక్తి అయితే ..మన మనిషే అని చెప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం..చాలాసార్లు కాకపోయినా కొన్ని సార్లు వాాళ్లు మనుషులే అనే విషయం మర్చిపోయి మనం అమానవీయంగా ప్రవర్తిస్తాం..నేను మాట్లాడేది హిజ్రాల గురించండీ…చాలా గొప్ప కథలు చెప్తాం..సగం ఆడ,సగం మగ అంటే శివపార్వతుల రూపం అని..కానీ వాస్తవపరిస్థితులకు వచ్చేసరికి మాత్రం మన మాటలు,చేతలతో,చూపులతోనే వారిని అవమానిస్తాం…సమాజంలో అస్తిత్వం కోసం నిత్యం పోరాటం చేస్తునే ఉన్నారు హిజ్రాలు..చాలామంది అవమానాలకు కృంగిపోతుంటే, కొందరు ఒక అడుగు ముందుకేసి విజయం వైపు వెళితున్నారు..

వారిలో ఒకరు అంజలీ అమీర్..21 ఏళ్ల అంజలీ అమీర్ రెండేళ్ల క్రితం సర్జరీ చేసుకుని కోయంబత్తూరులో మోడల్ గా రాణించింది.అయినా సరైన అవకాశాల్లేక ఎంతో మానసిక సంఘర్షణ అనుభవించింది. ముఖ్యంగా జెండర్ సమస్య ఆమెను విపరీతమైన క్షోభకు గురిచేసింది.ఎట్టకేలకు ఒక అవకాశం వచ్చింది. మోడల్ నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టింది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పక్కన హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది.మమ్ముట్టి ఎంత పెద్ద నటుడో మనకందరికి తెలుసు..అలాంటి యాక్టర్ పక్కన ఛాన్స్ అంటే నిజంగా అంజలీ ఆనందానికి అవధుల్లేవు.మలయాళీ బిగ్ హీరో మమ్ముట్టి హీరోగా తెరకెక్కిస్తున్న పెర్నాబు చిత్రంలో తొలిసారిగా ట్రాన్స్ జెండర్ అంజలి అమీర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎవరూ ఊహించని ప్రయోగం చేసిన మలయాళ ఇండస్ట్రీ, ఒక ఎల్జీబీటీ కమ్యూనిటీకి చెందిన మోడల్ ను హీరోయిన్ గా పరిచయం చేస్తున్నామని సగర్వంగా ప్రకటించుకుంది.సీను రామసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కొద్ది రోజుల్లో విడుదల కాబోతోంది. ఆమెను హీరోయిన్ గా తీసుకుందామని దర్శకుడు చేసిన ప్రపోజల్ ను మమ్ముట్టి తిరస్కరించలేదు సరికదా.. మంచి నిర్ణయం తీసుకున్నావని అభినందించాడు. అది ఆయన గొప్ప వ్యక్తిత్వం అని సంతోషంగా చెప్తోంది అంజలి అమీర్.