ఈ హీరోయిన్ కూతురు టాలీవుడ్ లో ఎంత పెద్ద సినిమాలకు పని చేస్తుందో తెలుసా..??

0
1275

ఈ హీరోయిన్ కూతురు టాలీవుడ్ లో ఎంత పెద్ద సినిమాలకు పని చేస్తుందో తెలుసా..??
నాటి అందాల తార కూతురు టాలీవుడ్ లో రైటర్ అన్న సంగతి మీకు తెలుసా?
చంద్రకళ… తన సహజ నటనతో ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకున్న ఒకప్పటితరం నటి. నటనతో పాటు సాంప్రదాయ నృత్యంలో నిష్ణాతురాలు. ఆమె అనేక తెలుగు, తమిళ, కన్నడ, మరాఠీ, మళయాళం చిత్రాలలో అద్భుతమయిన నటనను ప్రదర్శిచింది. చంద్రకళ మాతృభాష కొంకిణి తెలుగు, కన్నడం హిందీ భాషలను కూడా ఆమె మాట్లాడగలిగేది . షోలా ఔర్‌సబ్నం అనే హిందీ చిత్రంలో చంద్రకళ పరిచయం జరిగింది. ఆ తర్వాత అక్కినేని,ఎన్‌టిఆర్‌ లాంటి గొప్ప హీరోలతో పాటు హరనాథ్‌, శోభన్‌బాబు, చంద్రమోహన్‌, కృష్ణ, ఎన్‌టిఆర్‌, ఎ.ఎన్‌.ఆర్‌ల సరసన కూడా అద్భుతంగా నటించింది. తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన చంద్రకళ 1999జూన్‌ 21వ తేదీ, చెన్నైలో క్యాన్సర్‌ వ్యాధితో తనువు చాలించింది. ఆమె చనిపోయేనాటికి ఆమె వయస్సు 48 ఏళ్ళు.

చలన చిత్రం రంగం నుండి ఈమె దూరమై చాలా కాలమైనా ఆమె కుమార్తె రేష్మ మాత్రం ప్రస్తుతం ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ లో చాలా పాపులర్. యం.బి.ఏ. చేసిన రేష్మ 2008 నుంచి ఒక ఈవెంట్ మానేజ్ మెంట్ కంపెనీ ని స్థాపించి “రోబో” నుంచి “ఏమాయ చేసావే” సినిమా వరకూ అనేకం సినిమాలకు ప్రచార బాధ్యాతలను రేష్మ నిర్వర్తించింది. కాని ఆమె ఆ మధ్య వచ్చిన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన “ఎటో వెళ్లిపోయింది మనసు” సినిమాకు కధను తయారు చేసింది రేష్మ అన్న విషయం చాల కొద్దిమందికి తెలిసి ఉంటుంది. సాధ్యమైనంత వరకూ నిజ జీవితానికి దగ్గరగా ఉండే కధలు తను రాస్తాను అని చెపుతున్న రేష్మ ప్రస్తుతం సమాజంలో అమ్మాయిల గురించి అబ్బాయి లు, అబ్బాయిల గురించి అమ్మాయిలు ఎలా అనుకుంటారో అనే అనేక విషయాలను నిశితంగా పరిశీలించి ఈ కధను తయారు చేశానని రేష్మ చెపుతోంది. త్వరలోనే మో యూత్ ఫుల్ లవ్ స్టొరీ తయారు చేసే పనిలో బిజీగా ఉందట రేష్మ. సో.. మొత్తానికి టాలీవుడ్ లో ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న చంద్రకళ పిల్లల్లో ఎవరూ సినీ రంగంలో నటనా రంగంలోకి అడుగుపెట్టకపోయినా ఆమె పేరును నిలబెట్టేందుకు రేష్మా రైటర్ గా అడుగుపెట్టడం ఎంతైనా ఆనందదాయకం. రేష్మ భవిష్యత్తులో టాలీవుడ్ లో మంచి రైటర్ గా ఎదగాలని ఆశిద్దాం.