ప్రస్తుత హీరోల భార్యలు చాలా మంది ఇంటీరియర్ డెకరార్స్, బొటిక్స్., ఈవెంట్ మేనేజ్ మెంట్స్., ఫాషన్ డిజైనింగ్ వృత్తుల్లో ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తూ రెండూ చేతుల్తో ఎకౌంట్స్ నిండా సంపాదిస్తున్నారు.
కానీ ఒకప్పుడు తెలుగు సినిమా హీరోల భార్యలు ఎలా ఉండేవాళ్లో.. ఏంచేస్తుండే వాళ్లో బయట ప్రపంచానికి అస్సలు తెలిసేది కాదు. అసలు ఫోటో చూద్దామన్నా సాద్యమయ్యేది కాదు. ఎప్పుడో ఏదో పెళ్లిల్ల లోనో.. పేరంటాల లోనే కనిపించీ కనిపించనట్టు కనిపిస్తుండే వాళ్లు ఒకనాటి హీరోల భార్యలు. సభ్య సమాజానికి సంభందం లేదన్నట్టు వంటింటి పనులు, పిల్లల పెంపకానికే పరిమితం అయ్యే వాళ్లు. కాని కాలం మారింది. అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవు. హీరోల భార్యలు కూడా హీరోల సంపాదకు రెట్టింపు సంపాదిస్తున్నారంటే ఆశ్చర్యపడక తప్పదు. సినీ పరిశ్రమలో హీరోగా సెటిలై మంచి రెమ్యునరేషన్ తీసుకుంటున్న కధానాయకుల భార్యలు.. భర్త సంపాదన మీద ఆధార పడకుండా స్వతహాగా తమ ఆదాయ మార్గాలను వారు అణ్వేషించుకుంటున్నారు.
వరుస హిట్లతో దూసుకెళ్తున్న నాని భార్య అంజన,నటుడు రాజీవ్ కనకాల భార్య సుమ, అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి,అల్లరి నరేష్ భార్య విరూప, వేణు భార్య అనుపమ, రామ్ చరణ్ భార్య ఉపాసన, అందాల రాక్షషి హీరో రాహుల్ రవీంద్రన్ భార్య, ఈ హీరోల భార్య ల సంపాదన మన హీరోల సంపాదనకు రెట్టింపు సంపాదిస్తున్నారంటే ఆశ్చర్యపడక తప్పదు. ..