ఉసిరికాయ తో జ్యూస్ చేసి ఇలా తాగితే 100 రోగాలను ఒకేసారి నయం చెయ్యొచ్చు, అది ఎలా చేయాలో తెలుసుకోండి …!

0
1215

ఆధ్యాత్మిక పరంగా కార్తీకమాసంలో ఉసిరికాయలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక దీనిగురించి ఆరోగ్యపరంగా ప్రత్యేకించి చెప్పక్కరలేదు. ఉసిరిలో ఎన్నో ఔషదగుణాలు ఉన్నాయి. ఉసిరిని మనం కాయల రూపంలో తింటాము. అలా కాకుండా ఉసిరిని జ్యూస్ రూపంలో తీసుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయట.

మన శరీరంలో ఎక్కువగా ఉండే కొవ్వును ఆమ్లా జ్యూస్ కరిగిస్తుంది. అంతే కాకుండా ఆమ్లా జ్యూస్ మెటబాలిజం రేటును పెంచుతుంది. ఇక ప్రోటీన్ సింథసిస్ ఫ్యాట్ ఒంట్లోకి చేరకుండా చేస్తుంది. టాక్సీన్స్ ను తొలగించి ఎనర్జీ లెవల్స్ ను కూడా పెంచుతుంది.

ఆమ్లా జ్యూస్ మలబద్దకం తగ్గిస్తుంది.ఆమ్లా జ్యూస్ లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల బౌల్ మూమెంట్ మెరుగ్గా పనిచేసి,పెద్ద ప్రేగులోని టాక్సిన్స్ ను ఎఫెక్టివ్ గా బయటకు నెట్టేస్తుంది. అయితే తగ్గిస్తుంది కదా అని అతిగా తీసుకోకూడదు, పరిమితంగా మాత్రమే దీన్ని తీసుకోవాలి.

ఆమ్లా జ్యూస్ బ్లడ్ ప్యూరిఫైయర్ గా కూడా పనిచేస్తుంది. రక్తం లోని హీమోగ్లోబిన్, మరియు ఎర్ర రక్త కణాలను పెంచుతుంది. ఇందులో ఉండే యాంటీ యాక్సిడెంట్స్ గ్లోయింగ్ స్కిన్ కు కూడా చాలా సహాయపడుతుంది.

కంటి చూపును మెరుగుపరుస్తుంది: ఈ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.

గుండె కు మంచిది: ఉసిరి జ్యూస్ ను రోజు తీసుకుంటే గుండెకు చాలా మంచిది. అది ఎలా అంటే ఈ జ్యూస్ మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది. దాంతో గుండెకు సరఫరా అయ్యే రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది.

ఎముకల ఆరోగ్యానికి మంచిది: ఉసిరి రసంలో ఉండే విటమిన్ సి.. క్యాల్షియం గ్రహించడానికి ఎక్కువగా సహాయపడుతుంది… శరీరంలోని ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు క్యాల్షియం అధికంగా అవసరం.

పీరియడ్స్ నొప్పులకు అమృతవర్షిణి:పీరియడ్స్ లో బ్యాక్ పెయిన్, కడుపులో నొప్పి వంటి నొప్పులను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఆస్త్మా నుండి ఉపశమనం కలిగిస్తుంది:ఉసిరి రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే ఆస్త్మా దూరం అవుతుంది.

క్యాన్సర్ నివారణి: ఉసిరి రసంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కు కారణమయ్యే ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది.

డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది:ఉసిరి రసంలో ఉండే క్రోమియం బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది.