వయసు 21 ఏళ్లు మౌనిక బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. ‘నాకు సంతోషంగా వుండాలంటే భయమేస్తోంది.. అంటూ తన మనసులోవున్న నాలుగు మాటల్ని రాసేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ఆ తర్వాత ఉరేసుకుని చనిపోయింది.

హైదరాబాద్ సురారం కాలనీలోవుంటున్న సాయిదుర్గ మౌనిక తల్లి మందలించిందనే కారణంతో ఆత్మహత్య చేసుకుంది. మౌనిక తరచూ ఎక్కువ సమయం ఫేస్‌బుక్ ఛాటింగ్‌లో గడుపుతోందని తల్లి కోపంపడింది. దీంతో తన సంతోషాన్ని కూడా అవతల వ్యక్తులు చూడలేకపోతున్నారని.. తన జీవితంలో పదేపదే ఎదురవుతున్న ఈ పరిస్థితికి ముగింపు పలకాలని వుందనే అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది. ఆమెకు ఫేస్‌బుక్ ఛాటింగ్ ఒక వ్యసనంగా మారిందని భావించిన తల్లి రేణుక తరచూ మౌనికను మందలించేది. మౌనిక స్థానిక నర్సింహారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతోంది. తండ్రి కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయి చాలా కాలమైంది. తన కారణంగా కుటుంబంలో ఘర్షణ వాతావరణం నెలకొనడంతో మౌనిక భరించలేక పోయింది.

ఇదిలావుండగా చిన్నచిన్న కారణాలతో మరో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. మౌనిక తల్లి మందలించిందనే కారణంతో మరణిస్తే.. కష్టపడి చదివినా ఉద్యోగం రాలేదని మరో యువకుడు.. ఎంత చదివినా తలకు ఎక్కడ లేదనే కారణంతో సంయుక్త అనే మరో యువతి ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరంతా 15-25 వయసులోవున్న యువతీయువకులే కావడం బాధకలిగించే విషయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here