ఏటీఎం కార్డ్ హాల్డర్లకు బంపర్ ఆఫర్స్.. తెలియకపోతే నష్టపోతారు!! షేర్ చేయండి..

0
883

బ్యాంకింగ్ లావాదేవీలన్నా డిజిటలైజ్ అయిన తర్వాత ఆన్ లైన్ లావాదేవీలు మాత్రమే చేయాల్సిన అనివార్యత వచ్చింది. ఇందులో భాగంగా దేశంలోని బ్యాంకులన్నీ తమ ఖాతాదారులకు ఏటీఎం కార్డులు ఇచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో బ్యాంకులు తమ కష్టమర్లలో 90శాతం మంది వరకు రూపే ఏటీఎం కార్డులే ఇస్తున్నాయి. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ద్వారా ఖాతాలు తీసిన వారికీ రూపే ఏటీఎం కార్డులే పంపిణీ చేశాయి. గ్రామీణ బ్యాంకులన్నీ తమ అకౌంట్ హోల్డర్లకు కంపల్సరీగా రూపే కార్డు ఇస్తున్నాయి.


అయితే చాలా మందికి తెలియని విషయం.. రూపే కార్డు హోల్డర్లు ఇన్సూరెన్స్‌కు అర్హులు. రూపే కార్డుదారులకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకూ ఇన్సూరెన్స్‌ను కేంద్రం అందజేస్తుంది. అన్ని బ్యాంకుల రూపే ఏటీఎం, డెబిట్‌ కార్డుదారులకు ఇది వర్తిస్తుందని ప్రభుత్వం తాజాగా తెలిపింది. ప్రమాదంలో మరణించిన, శ్వాశ్వత వైకల్యం పొందిన వారికి ఇన్సూరెన్స్‌ లభిస్తుంది. రూపే క్లాసిక్‌ కార్డుదారుడైతే రూ.లక్ష, రూపే ప్రీమియం కార్డుదారుడైతే రూ.2 లక్షలను వారి కుటుంబ సభ్యులకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఇండియా చెల్లిస్తుంది. ప్రమాదం జరిగిన 90 రోజుల్లోగా ఇన్సురెన్స్‌ను క్లెయిమ్‌ చేసుకోవాలి. నామినీ లేదా వారి వారసులు అర్హులు. ఇక ఐసీఐసీఐ బ్యాంకు తమ ఏటీఎం హోల్డర్లకు ఓ కొత్త ఆఫర్ ఇచ్చింది.

ఏటీఎంలలో డబ్బులు తీసుకున్నంత సులువుగా రూ. 15లక్షల వరకు వ్యక్తిగత లోన్లు అందించేందుకు ఐసీఐసీఐ సిద్ధమైంది. అయితే ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్‌ వర్తించనుంది. ఇందుకోసం కంపెనీల నుంచి ఉద్యోగుల సమాచారం తీసుకుని.. అందులో నుంచి వ్యక్తిగత లోన్ల కోసం కొందరు కస్టమర్లను ఎంపిక చేస్తుంది. ఈ వినియోగదారులు ఏటీఎం ద్వారా నగదు ట్రాన్సాక్షన్‌ చేసుకున్నప్పుడు స్క్రీన్‌పై లోన్‌ గురించి మెసేజ్‌ వస్తుంది. అప్పుడు కస్టమర్‌ దాన్ని సెలెక్ట్‌ చేసుకుంటే.. రూ. 15లక్షల వరకు లోన్‌ ఇవ్వనున్నట్లు ఐసీఐసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఐదేళ్ల గడువుతో ఈ లోన్‌ ఇస్తున్నట్లు పేర్కొంది. లోన్‌ ఎంత కావాలో సెలెక్ట్‌ చేసుకుంటే వెంటనే ఆ నగదు వినియోగదారుడి ఖాతాలోకి బదిలీ అవుతుంది. లోన్‌ ఎంత కావాలో ఏటీఎం స్క్రీన్‌పైనే సెలెక్ట్‌ చేసుకోవచ్చు. దీంతో పాటు వడ్డీ రేటు, ప్రాసెసింగ్‌ ఫీజు, నెలవారీ వాయిదాలు తదితర వివరాలను కూడా స్క్రీన్‌పై కష్టమర్లు చూడవచ్చు. 60నెలల ఫిక్స్‌డ్ కాలవ్యవధిలో కష్టమర్లు రూ.15లక్షల వరకు వ్యక్తిగత రుణాలు పొందవచ్చని ఐసీఐసీఐ బ్యాంకు స్పష్టం చేసింది. అవన్నీ నచ్చితే.. ఏటీఎంలలోనే లోన్‌ తీసుకోవచ్చు. ఐసీఐసీఐ నుంచి ఒక్కసారి కూడా లోన్‌ తీసుకోని వారికి సైతం ఈ అవకాశం కల్పిస్తున్నట్లు బ్యాంకు స్పష్టం చేసింది.