ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు వీళ్ళంతా టాప్ హీరోయిన్స్..ఎలా ఉన్నారో తెలుసా.. ??

0
1460

మనం తెలుగు వాళ్ళం. సినిమాలు చాలా బాగా చూస్తాము. సినిమా మీద ప్రశ్నలు అడిగితే టక్కున సమాధానం చెప్పేయగలం మనం. అయితే ఇక్కడ మీకోసం ఒక ప్రశ్న. మనం చిన్నప్పుడు చూసిన “మనసంతా నువ్వే, జై చిరంజీవ, ఆర్య, అరుంధతి” ఈ సినిమాలు గుర్తున్నాయా! అయ్యో! అవెందుకు గుర్తులేవు…చిన్నపుడు తెగ చూశాం ఆ సినిమాలు అనుకుంటునారా? అయితే ఆ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌లు గా నటించిన చిన్న పిల్లలు కూడా గుర్తు ఉండే ఉంటారు. కాలం మారుతూ ఉంటుంది. మన వయస్సు పెరిగింది అప్పటికీ ఇప్పటికీ…మరి మనతో పాటు ఆ సినిమాల్లో నటించించిన చిన్న పిల్లల వయసు కూడా పెరిగే ఉంటది కదా? వాళ్ళు ఇప్పుడు పెద్ద వాళ్ళు అయ్యే ఉంటారు కదా? మరి ఇప్పుడు ఎలా ఉన్నారు అంటారు? అప్పటి చైల్డ్ ఆర్టిస్ట్స్ ఇప్పుడు ఎలా ఉన్నారో ఏంచేస్తున్నారో చూడండి!

సుహాని కలిత

సినిమా లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది సుహాని . తెలుగుతోపాటు హిందీ, మలయాళం, బెంగాళీ చిత్రాలలో నటించింది. సుహాని వాళ్ల స్వస్థలం ముంబై. సుహాని 1901, డిసెంబర్ 25న హైదరాబాద్ లో జన్మించింది. పాఠశాల విద్య నుండి ఉన్నత విద్య వరకు హైదరాబాద్ లోనే చదివింది. సుహానీ, 1996లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాల రామాయణం చిత్రంలో బాలనటిగా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తరువాత కొన్ని తెలుగు, ఒక హిందీ, ఒక బెంగాళీ సినిమాలలో బాలనటిగా నటించింది. 2008లో బి. జయ దర్శకత్వంలో వచ్చిన సవాల్ సినిమాతో హీరోయిన్ గా మారింది. బాలనటి గా 40 చిత్రాల, హీరోయిన్ గా 11 చిత్రాలలో నటించంది.

శ్రియ శర్మ


‘జై చిరంజీవ’ సినిమాలో చిరంజీవి మేన కోడ‌లుగా న‌టించిన పాప గుర్తిందిగా. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాష సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. శ్రియ శర్మ తన మూడేళ్ళ వయసులో బాలనటిగా తన కెరీర్ ప్రారంభించి శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన నిర్మలా కాన్వెంట్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. శ్రియా శర్మ హిమాచల్ ప్రదేశ్ లోని పాలంపూర్ లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ప్రస్తుతం శ్రియ శర్మ ముంబై విశ్వవిద్యాలయంలో చదువుతోంది. నిర్మ‌ల కాన్వెంట్‌లో చేసిన హీరోయిన్ శ్రియ శ‌ర్మ‌. ఆ సినిమాతో హీరోయిన్‌గా అవ‌కాశాలు వ‌స్తాయ‌నుకుంది. కానీ అది ఫ్లాప్ కావ‌డంతో ఎలాగైనా హీరోయిన్ అవ‌కాశాలు అందుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది. ఇందుకోసం గ్లామ‌ర్ డోస్ పెంచేందుకు కూడా సిద్ధం అయింద‌ని టాక్‌. చూద్దాం ఈ అమ్మ‌డి ఆఫ‌ర్‌ని ఏ డైరెక్ట‌రైనా ఉప‌యోగించుకుంటాడో చూడాలి మరి.

శ్రావ్య

బాలనటిగా తెలుగు సినిమారంగానికి పరిచయమైన శ్రావ్య 2014లో వచ్చిన లవ్ యు బంగారమ్ సినిమాతో హీరోయిన్ గా మారింది. శ్రావ్య హైదరాబాద్ లో జన్మించింది. విజ్ఞానజ్యోతి ఇన్సిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లో బిటెక్ పూర్తిచేసింది. చిన్నతనం నుండి నటనపై ఇష్టం ఉన్న శ్రావ్య బాలనటిగా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించి సందడే సందడి, నేను సీతామహాలక్ష్మి, ఆర్య, ఔనన్నా కాదన్నా వంటి చిత్రాలలో బాలనటిగా నటించింది. 2014లో వచ్చిన లవ్ యు బంగారమ్ సినిమాతో హీరోయిన్ గా మారి కాయ్ రాజా కాయ్, నందిని నర్సింగ్‌హోం వంటి సినిమాలలో నటించింది. వెల్లికిజామై 13ఏఏం తేతి సినిమాతో తమిళ సినిమారంగంలోకి ప్రవేశంచి పగిరి, విలైయట్టు ఆరంభం వంటి చిత్రాలలో నటించింది.

దివ్య నగేష్

అరుంధతి సినిమా రిలీజై ఇప్పటికే దశాబ్ధం పైగా అయ్యింది. ఆ సినిమా ఎప్పటికీ టాలీవుడ్ లో డిష్కసన్ పాయింట్. అందులో జేజమ్మగా స్వీటీ అనుష్క అసమాన నటన కనబరిచింది. స్వీటీతో పోటీపడుతూ .. అదే చిత్రంలో దివ్య అనే చిన్నారి అద్భుతంగా నటించి అందరిచేతా జేజేలు అందుకుంది. దివ్య బుల్లి .జేజమ్మగా అద్భుతమైన ప్రతిభను కనబరిచింది. ఆ తర్వాత దివ్య తెలుగు తమిళ్ లో కథానాయికగా ఎటెంప్ట్ చేసింది. తెలుగులో నేను నాన్న అబద్ధం అనే చిత్రంతో కథానాయికగా పరిచయమైంది. కానీ ఎందుకనో కెరీర్ లో నిలదొక్కుకోలేకపోయింది. ప్రస్తుతం ఓ కోలీవుడ్ సినిమాలో నటిస్తూ టచ్ లోకి వచ్చింది. కథానాయికగా ఇటీవలి కాలంలో గ్యాప్ రావడానికి కారణం ఎడ్యుకేషన్ లో బిజీ చేస్తుంది. ప్రస్తుతం గాయకుడు మనో కొడుకు షకీర్ కి జంటగా నటిస్తుంది. ఓ వైపు ఎంజీఆర్ యూనివర్శిటీ బీబీఎ సెంకండియర్ చదువుతూనే సినిమాల్లో నటన కొనసాగిస్తుంది దివ్య.