కని వినీ ఎరుగాని రీతిలో ప్రయోజనాలు..ఈ ఆకును వాడితే మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది!

0
1195

మన తెలుగు వాడికి ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు గోంగూర గురించి.గోంగుర అంటే మన వారికి పిచ్చి అనే చెప్పాలి.చాలా మంది అయితే గోంగుర లేకుండా అన్నం కూడా తినరు.అయితే ఈ గోంగూర ను ఎన్ని రకాలుగా పచ్చడి,పప్పు,లేదా చికెన్,మటన్ లలో వేసినా కాని దానికి వచ్చే రుచే వేరు.గోంగుర అంటే అంత ఇష్టం మరి అందరికి.అయితే ఈ గోంగూర వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.దీర్ఘ కాలిక రోగ సమస్యలను ఇది నయం చేస్తుంది.అయితే ఈ మధ్య కాలం లో చాలా మంది సూప్స్ త్రాగడానికి ఇష్టపడుతూ ఉన్నారు.అయితే మీరు ఏ సూప తాగినా కాని దానిలో కొన్ని గోంగూర ఆకులు వేస్తే జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేస్తూ మలబద్ధకాన్ని లేకుండా చేస్తుంది.గోంగూర వల్ల గుండెకు చాలా మేలు చేస్తుంది.శరీరం లో ఉండే కొవ్వును కూడా ఇది నియంత్రిస్తుంది.

గోంగూరలో ఖనిజ లవణాలు ,పొటాషియం కారణం గా ఇది రక్త ప్రసరణను చక్కగా పనిచేసేలా చేస్తూ రక్తపోటును అదుపులో ఉంచుతుంది.దీనిలో విటమిన్ ఏ అధికం గా ఉండడం వలన మనకు కంటి సమయల నుంచి రక్షిస్తుంది.రకరకాల రోగాలకు చెక్ పెట్టే శక్తి ఈ గోంగూర కు ఉందని పరిశోధకులు చెబుతున్నారు.గోంగూర లో కాల్షియం,ఇనుము అధికం గా ఉంటాయి కాబట్టి రోజూ తినే ఆహరం లో గోనూర ఉండేలా చూసుకుంటే ఎముకలు ద్రుడం గా అలాగే రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది.రక్తం లో ఇన్సులిన్ ను పెంచి షుగర్ స్థాయిని తగ్గించే శక్తి ఉంది.మధుమేహం ఉన్న వారు గోంగూర ను తీసుకోవడం వలన షుగర్ నియంత్రించుకోవచ్చు.గోంగూర ఫోలిక్ యాసిడ్స్ ,మినరల్స్ అధికంగా ఉంతాయి.గుండె,క్యాన్సర్,కిడెనీ వంటి సమస్యలకు ఇది బాగా ఉపయోగ పడుతుంది.అలాగే దగ్గు,జలుబు వంటి సమస్యలతో భాధపడేవారు కూడా ఇది తీసుకుంటే మంచిది.గోంగూర ను డైలీ వాడితే రక్తపోటు,నిద్ర లేమి వంటి సమస్యలు తగ్గుతాయి.