కేన్సర్‌ చికిత్సకు చౌకైన, వినూత్నమైన చికిత్సను అమెరికాలోని డ్యూక్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. శస్త్రచికిత్స అవసరం లేకుండానే కణితులను పూర్తిగా తొలగించగలగడం ఈ చికిత్స విశేషం. బయోడీజిల్‌ అనే ఇథనాల్‌కు ఇంకో రసాయానాన్ని కలిపి నేరుగా శరీరంలోకి ప్రవేశపెడితే కొద్దికాలంలోనే కణితి మాయమైనట్లు తెలిసింది.

ఎథనాల్‌ కేన్సర్‌ కణాలను చంపేయగలదని తెలిసినా.. చాలా ఎక్కువ మోతాదుల్లో వాడాల్సి రావడం.. ఇథనాల్‌ ప్రభావంతో కణితి పరిసరాల్లో ఉన్న కణజాలం నాశనమవుతుండటం వల్ల దీన్ని వాడలేకపోయారు. డ్యూక్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ సమస్యను అధిగమించారు. ఇథనాల్‌కు ఇథైల్‌ సెల్యులోజ్‌ను జోడించారు. ఈ మిశ్రమాన్ని కణితిలోకి జొప్పించినప్పుడు అది అక్కడే జిగురు పదార్థంగా మిగిలిపోయింది.

కేన్సర్‌ ఉన్న ఎలుకలపై ఈ ద్రవాన్ని ఉపయోగించినప్పుడు అద్భుతమైన ఫలితాలు కనిపించాయి. 8 రోజుల్లోనే కణితి పూర్తిగా మాయమైపోయినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇథనాల్‌ అబ్లేషన్‌ అని పిలిచే ఈ సరికొత్త చికిత్స విధానం సంప్రదాయ శస్త్రచికిత్సకు ఏమాత్రం తీసిపోదని.. మరిన్ని పరిశోధనలు చేయడం ద్వారా అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here