గుడిచుట్టూ ప్రదక్షిణ చేయటానికి వీలు లేకపోయినా తిరుగుతూ 3500 అడుగుల లోయలో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు..

0
1002

తనను మంచిగా చూడమని ఆ దేవుణ్ణి వేడుకుంటూ చావు కొసలమీద విన్యాసం చేస్తున్నారు భక్తులు.అంటే ఒక్క అడుగు తడబడినా భూలోకం నుంచి పరలోక యాత్రనే.. ఇక్కడ విజయవంతమైన ఒక్కో ప్రదక్షిణ ఆయుష్షును నిలబెట్టినట్టే. పట్టుతప్పితే ఇక ఆయువు తీరినట్టే.. భక్తి అనబడే పిచ్చి పీక్స్ కు చేరి ఓ ఆలయం చుట్టూ చావును వెంబడేసుకుని ప్రదక్షిణ చేసే వింత ఆలయం ఒకటి ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ భక్తుడు తాజాగా కేవలం కొద్దిగా కాలుజారినందుకే ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఇది వెలుగులోకి రావడంతో దేశ వ్యాప్తంగా వైరల్ అయింది. కాని ఇటువంటి చావు బతుకుల మధ్య ప్రదక్షిణలు ఈ ఆలయంలో నిత్య కృత్యమని చెబుతున్నారు. ఈ ప్రదక్షిణ రూపంలోని పరలోక యాత్ర గురించి తెలుసుకోవాలంటే తమిళనాడులోని తిరుచ్చికి వెళ్లాలి..

తమిళనాడు లోని తిరుచ్చి దగ్గరలో ఉన్న ఒక ఆలయం పేరు “సంజీవి పెరుమాళ్ కోవెల”. ఇది భూమికి 3500 అడుగుల ఎత్తులో ఉంటుంది. గుడి చుట్టూ ఏమీ చోటు లేదు, పట్టుతప్పితే పై లోకాలకు పంపే ప్రమాదకరమైన లోయ. చాలా మంది గుడి చుట్టూ చిన్న అంచుపై సర్కస్ చేసినట్లు గుండె గుప్పెట్లో పెట్టుకునైనా గుడి చుట్టూ తిరగటం చేస్తారు. కానీ శనివారం ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి మూడో చుట్టూ తిరుగుతుండగా పట్టుతప్పి లోయలో పడిపోయాడు. ఈ వీడియో చూడండి. అంచుపై నడవటం ఎంత ప్రమాదకరంగా ఉందో తెలుస్తుంది.


ప్రదక్షిణ అంటే భక్తులు ఆలయ అంచుల వెంట, ఆ రాతి ప్రహరీ వెంట, చేత్తో జాగ్రత్తగా రాళ్లను పట్టుకుంటూ, ఒక్కొక్క అడుగే ఆచితూచి వేయాలి. ఇంత ప్రమాదకరం అయినా సరే కొందరు భక్తులు ఆ సాహసోపేత, ప్రాణాంతక ప్రదక్షిణలు చేస్తూనే ఉంటారు. అది చేస్తేనే దేవుడి కరుణ దక్కుతుందనేది వారి పిచ్చి నమ్మకం. ఇప్పుడు ఓ భక్తుడు ఇలా గిరివాలయం మూడో ప్రదక్షిణ చేస్తూ పడిపోయిన దృశ్యాన్ని అక్కడి వారు కెమెరాలో బంధించేప్పటికి తమిళ్ మీడియా కథనాలు వేసింది. ఇక అంతే దాని ఆధారంగా దేశ వ్యాప్తంగా మీడియా ఫోకస్ చేసింది. సోషల్ మీడియాలోనూ బతకడానికి ఉండాల్సిన భక్తిని చావుకు సమర్ఫణగా మల్చుకోవడంపై ఒకింత ఆశ్చర్యం, ఒకింత ఆవేదనతో స్పందిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన ప్రదక్షిణ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వైనాన్ని కింది వీడియోలో చూడండి మీకే తెలుస్తుంది.