చిన్ననాటి హీరో పాత్రలో అలరించిన హీరోల కొడుకులు

0
1040

ఆ హీరోల చిన్నప్పుడు పాత్రలు వాళ్లకొడుకులే ధరించారు. ..ఆ హీరోలెవరో మీకు తెలుసా…?
ఎవరికైనా తండ్రి పోలికలు కొద్దిగా కాకపోయినా కొద్దిగా అయినా ఉంటాయి. ఒకోసారి అచ్చుగుద్దినట్టు పూర్తిగా తండ్రిలాగానే ఉంటారు. ఆ పోలికలు ఎవరికైనా జీన్సు నుంచే వస్తాయి. ఇదే సూత్రాన్ని రివర్స్ చేసి సినిమాల్లో అప్లై చేస్తే అభిమానులకు పండగ, ప్రేక్షకులకు సంబరం. అంటే ఒక హీరో చిన్నప్పటి సీన్స్ లో వాళ్ల కన్న కొడుకులే నటించడం అన్నమాట. దీన్ని ముందుగా జనానికి బాగా అలవాటు చేసిన హీరో సూపర్ స్టార్ కృష్ణ. కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు , తండ్రి హీరోగా నటించిన అల్లూరి సీతారామరాజు లో చిన్నప్పటి కృష్ణ గా నటించి అప్పటి జనాన్ని ఉర్రూతలూగించారు రమేష్ బాబు. ఆ తర్వాత ఈ ఫీట్ చేసిన మరో హీరో మంచు మనోజ్ . మోహన్ బాబు హీరోగా కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేసిన పుణ్యభూమి నాదేశంలో చిన్నప్పటి మోహన్ బాబుగా మంచు మనోజ్ కనిపిస్తాడు.

ఇక ఇప్పటి తరం హీరోల్లో తన కొడుకుచేత ఆ పాత్రధరింపచేసిన హీరో ల్లో మొదటి వాడు సూపర్ స్టార్ మహేష్ బాబే. మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ .. సుకుమార్ ,మహేష్ బాబు మొదటి కాంబో మూవీ వన్ నేనొక్కడినే లో చిన్నప్పటి మహేష్ బాబుగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ సినిమాలో గౌతమ్ కృష్ణ తొణుకు బెణుకు లేకుండా చక్కగా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.

ఆ తర్వాత హీరో సుధీర్ బాబు . అతడు నటించిన మోసగాళ్ళకు మోసగాడు లో అతడి చిన్నప్పటి పాత్రను అతడి కొడుకైన చరిత్ మానస్ నటించాడు. ఆ సినిమా ప్లాప్ అవడం వల్ల అందులోని సుధీర్ బాబు తో పాటు , అతడి కొడుకును కూడా ఎవరూ పట్టించుకోలేదు.

ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ .. ఇప్పుడు ఈ సారి తన చిన్నప్పటి పాత్రలో తన కొడుకును నటింపచేస్తున్న మరో హీరో మాస్ మహారాజ రవితేజ. రవితేజ లేటెస్ట్ మూవీ రాజా ది గ్రేట్ లో రవితేజ చిన్నతనంలోని కేరక్టర్ ను అతడి కొడుకు మహాధన్ ధరించాడని చెప్పుకుంటున్నారు. ఆ పాత్రకోసం ఎవరూ దొరక్క చివరికి రవితేజ కొడుకును ఆశ్రయించాడట దర్శకుడు అనిల్ రావిపూడి.

ఇక కొసమెరుపేంటంటే ఇలా చిన్నప్పటి పాత్రలు కొడుకులే ధరించే ఆచారాన్ని మాలీవుడ్ లోనూ పాటించారు. మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ మోహన్ లాల్ , మోహన్ లాల్ నటించిన ఒన్నామన్ అనే సినిమాలో ఆయన చిన్నప్పటి పాత్రను ప్రణవ్ మోహన్ లాల్ తో ధరింపచేసారు. మొత్తం మీదా కొడుకు నటించాడనే సంతోషం తోపాటు తమ అభిమానుల్ని అలరించారన్న కీర్తి కూడా మూటగట్టుకున్నారు ఈ టాప్ హీరోలు.