‘జబర్ధస్త్’ కార్యక్రమం ప్రసారం అయ్యే ముందు ఓ కార్డు వేస్తారు. ఈ కార్యక్రమం కేవలం నవ్వుల కోసమే, ఎవరినీ కించపరచడానికి కాదు, అది మా ఉద్దేశ్యం కాదు అంటూ వేసే బోర్డులో ఉన్న మ్యాటర్ స్కిట్‌లోకి వచ్చే సరికి రివర్స్ అవుతోంది. ఈ స్కిట్స్‌లో చేసే వ్యక్తులు వారిపై వారే పంచ్‌లు వేసుకుంటే ప్రాబ్లమ్ లేదు కానీ, వారు అప్పుడప్పుడు బయటి వ్యక్తులను కూడా దీనికి లింక్ చేయడంతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయక తప్పడం లేదు. ఈ మధ్య మహేష్ కత్తిపై పంచులు వేయడమే కాకుండా అతని అవతారంపై పంచ్‌లు పేల్చాడని హైపర్ ఆది గురించి ఓ అరగంట వీడియోని రిలీజ్ చేశాడు మహేష్ కత్తి. ఇలాంటివి గతంలో కూడా జరిగాయి. కానీ తాజాగా మరోసారి హైపర్ ఆది స్కిట్ వివాదాలకు కారణం అయింది. ఆయనపై కేసు కూడా నమోదైంది.
ఇంక విషయంలోకి వస్తే హైపర్ ఆదిపై, జబర్ధస్త్‌పై సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు అనాధ బాలలు. తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా స్కిట్ చేశారు అంటూ పూజిత అనే అనాధ బాలిక హైపర్ ఆదిపై ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు చేయడానికి కారణం హైపర్ ఆది తన స్కిట్‌లో ”అతిగా ఆవేశపడే ఆడదానికి, అతిగా ఆశపడే మగాడికి కలిగే సంతానమే అనాథలు” అనే డైలాగ్. స్కిట్‌లో పెట్టిన ఈ డైలాగ్ బాలల హక్కులు మరియు మానవ హక్కుల ఉల్లంఘనగా తీసుకుని హైపర్ ఆదిపై కఠినచర్యలు తీసుకోవాలి అంటూ అనాధ ఆశ్రమ బాలలు మరియు కత్తి మహేష్ హెచ్‌ఆర్‌సిలో ఫిర్యాదు చేశారు.