జై లవకుశ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది

0
917

జై లవకుశ’ ఫీవర్‌.. టాలీవుడ్‌ను, జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులను ఊపేస్తోంది. తొలిసారి యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయంతో తెరపై దుమ్మురేపడానికి సిద్ధమవుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డైరెక్టర్‌ బాబీ (కేఎస్‌ రవీంద్ర) దర్శకత్వంలో సోదరుడు కల్యాణ్‌ రాం తెరకెక్కించిన ఈ సినిమాలో జై, లవ, కుశగా మూడు విభిన్నమైన పాత్రల్లో ఎన్టీఆర్‌ అలరించబోతున్నాడు. ఈ సినిమా కథ ఏమిటనేది ట్రైలర్‌ ద్వారా.. ఎన్టీఆర్‌ తాను ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారా చూచాయగా చెప్పేశారు. రామలక్ష్మణుల్లా పెరగాల్సిన ముగ్గురు అన్నదమ్ములు రావణ, రామ-లక్ష్మణులుగా మారడమే ఇందులోని కథ. ఇందులో జై పాత్ర రావణుడి ఛాయలతో సాగుతోంది. నాటకాలు అధికంగా ఇష్టపడే జై.. రావణుడిలా ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు.

ఇప్పటికే తారస్థాయి అంచనాలు ఉన్న ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగేలా మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవీశ్రీ ప్రసాద్‌ ట్వీట్‌ చేశారు. ‘జైలవకుశ’ సినిమాను డైరెక్టర్‌ బాబీ అద్భుతంగా తెరకెక్కించారని, యంగ్‌టైగర్‌ ఎన్టీర్‌ మైండ్‌బ్లోయింగ్‌ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడని దేవీ ట్వీట్‌ చేశాడు. రావణా అంటూ ‘జై’ పాత్రలో ఎన్టీఆర్‌ అదరగొట్టినట్టు హింట్‌ ఇచ్చారు.