డ్రంక్ అండ్ డ్రైవ్ వివాదంలో నటుడు రాజశేఖర్.. పీవీ ఎక్స్ ప్రెస్ హైవే పై కారును ఢీ కొట్టిన రాజశేఖర్

0
925

హీరో రాజశేఖర్ డ్రంక్ అండ్ డ్రైవ్ వివాదంలో చిక్కుకున్నారు.. హైదరబాద్ రాజేంద్ర నగర్ దగ్గర పీవీ ఎక్స్ ప్రెస్ హైవే పై ఈ ప్రమాదం జరిగింది..హీరో రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వెళ్తున్న మరో కారును ఢీ కొట్టింది.. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగ లేదు.. శం షాబాద్ విమానాశ్రయం నుండి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.. రాం రెడ్డి అనే వ్యక్తి పిర్యాదు చేయడం తో అక్కడికి చేరుకున్న పోలీసులు రాజశేఖర్ మద్యం సేవించి కారు నడుపుతున్నారెమో అని బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేశారు..అయితే ఆల్కహాల్ మోతాదుకు మించి సేవించ లేదని తెలిసింది.. దీంతో రాజశేఖర్ ను పంపించేశారు పోలీసులు..