తనను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న టాప్ హీరో

0
1604

ప్రేమ, పెళ్లి… సగం ప్రపంచం వీటి విషయంలో విజయం సాధించడానికి ప్రయత్నిస్తుంటుంది. మిగిలిన ప్రపంచం వీటి విషయంలో సాధించిన విజయాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది! అనుకున్న వారి ప్రేమను పొందడం, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, చేసుకున్న పెళ్లిలో పార్ట్‌నర్‌తో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవడం.. జీవితానికే పెద్ద ఛాలెంజ్‌. మరి ఈ విషయాల్లో మెజారిటీ మంది విజయం సాధిస్తారు.విజయవంతమైన వైవాహిక జీవితాన్ని సాగిస్తారు.

సినిమా పరిశ్రమలో ప్రేమ- పెళ్లిళ్ళు తెగ జరిగిపోతున్నాయి. గతంలో స్టార్ హీరోలందరూ పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. అయితే ఈమధ్య యువ హీరోలు మాత్రం ప్రేమ వివాహలకే ఓటేస్తున్నారు. ఇప్పటికే చాలామంది యువ హీరోలు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఇలా ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లలో విజయ్ ఆంటోనీ ఒకరు. తన ప్రేమ పెళ్లి ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం .

సన్‌ టీవీ యాంకర్‌ ఒకసారి విజయ్ కి ఫోన్ చేసి మీ పాటలు బావున్నాయని అభినందించింది. మాటల సందర్భంలో తను పక్క వీధిలోనే ఉన్నానని ఆవిడా చెప్పడం, సరేనని ఇద్దరు కలిశారు . రెండో రోజు విజయ్ వాళ్ల ఇంటికి వెళ్ళాడు . మూడో రోజు విజయ్ తనకు ప్రపోజ్‌ చేసాడు. నాలుగో రోజు వాళ్ళ అమ్మకు, చెల్లెకి-బావగారికి చెప్పాడు . వాళ్ళ కుటుంబానికి కులమతాల పట్టింపులు లేవు. ‘ఫాతిమా’ అనే పేరు విని తను ముస్లిమా? క్రిస్టియనా? అని కూడా అమ్మా, చెల్లి అడగలేదు. ప్రేమను గుర్తించి గౌరవించారు. వాళ్ల ఇష్టాన్ని వ్యక్తం చేశారు. వెంటనే ఫాతిమాను మన భిక్షగాడు భార్యగా డిక్లేర్‌ చేసేశాను. వాళ్లది కూడా క్రిస్టియన్‌ ఫ్యామిలీ అని తర్వాత తెలిసింది. ఓ వైపు కొత్త కాపురం, మరో వైపు మ్యూజిక్‌ డైరక్టర్‌గా వరుస అవకాశాలు రావడం తో బిజీ అయిపోయాడు . వీళ్ళకి ఇద్దరమ్మాయిలు పుట్టారు. పిల్లల పేర్లు మీరా, లారా . తెలుగులో ‘మహాత్మా’, ‘దరువు’ అంటూ వరుసగా సినిమాలు చేసాడు . నటుడిగా తమిళంలో ‘నాన్‌’ అని ఒక సినిమా చేసాడు. తెలుగులో ‘నకిలీ’ పేరుతో విడుదలైంది. మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు . ‘బిచ్చగాడు’కు తెలుగులో మంచి రెస్పాన్స్‌ వచ్చింది.