దసరా నవరాత్రుల్లో ఈ పనులు చేస్తే జీవితాంతం కష్టాలేనట!!

0
1165

గతం కంటే వైభవంగా ఈ ఏడాది దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీకగా ఈ వేడుకను చూస్తున్న కేసీఆర్ ఏడాదిలో వచ్చే అన్ని పండుగల కంటే దసరాకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. బతుకమ్మ ఆటల కోసం తెలంగాణ ఆడపడుచులందరికీ ప్రభుత్వం తరపున చీరలు సైతం పెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఆంధ్రుల రాజధానిగా సరికొత్త వైభవంతో భాసిల్లుతున్న విజయవాడలో కనకదుర్గ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు సైతం అంగరంగ వైభవంగా జరిపేందుకు అక్కడి ప్రభుత్వం ఎప్పుడూలేనంతగా ఏర్పాట్లు చేసింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలూ ఆధ్యాత్మిక శోభతో ఓలలాడుతున్నాయి. వాడ వాడలా మునుపెన్నడూ లేనంతగా అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేశారు. 9 రోజుల పాటు న‌వ‌రాత్రులతో ఊరూ వాడా మార్మోగనున్నాయి. అయితే ఈ ఉత్సవాలు జ‌రిగిన‌న్ని రోజులు కొన్ని సూచ‌న‌లు పాటించాల్సి ఉంటుందని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. అవేమిటో, వాటి వ‌ల్ల ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

* హెయిర్ క‌ట్

న‌వ‌రాత్రులు జరిగినన్నిరోజులు ఎవ‌రూ హెయిర్ క‌ట్ చేయించుకోకూడ‌ద‌ట‌. అలాగే గుండు చేయించుకోవ‌డం వంటి కార్యక్రమాల‌ను కూడా పెట్టుకోకూడ‌ద‌ట‌. ఎందుకంటే అలా చేస్తే దుర్గా దేవి ఆగ్రహిస్తుంద‌ట‌. దీంతో భ‌క్తుల‌కు క‌ష్టాలు ఎదుర‌వుతాయట.

* క‌ల‌శం

ఇంట్లో దుర్గాదేవికి పూజ చేసేప్పుడు అమ్మవారి ఎదుట క‌ల‌శం ఉంచాలి. అలాగే దేవి ఎదుట అఖండ జ్యోతి వెలిగించాలి. అది 9 రోజుల పాటు ఆరిపోకుండా చూడాలి. ఇక ఇంట్లో 9 రోజుల పాటు ఖచ్చితంగా ఎవ‌రో ఒక‌రు ఉండాలి. అంతేకాని ఎవ‌రూ లేకుండా ఇంటికి తాళం పెట్టరాదు. అలా చేయ‌డం వ‌ల్ల దేవి అనుగ్రహం ల‌భించద‌ట.

* నిమ్మకాయ

న‌వ‌రాత్రులు జ‌రిగిన‌న్ని రోజులు ఇంట్లో నిమ్మకాయ‌ను కోయ‌రాద‌ట‌. అలా చేస్తే అరిష్టం క‌లుగుతుంద‌ట‌. కానీ మ‌రి నిమ్మర‌సం లేక‌పోతే ఎలా.. అంటే అందుకు ప‌రిష్కారం ఉంది. మార్కెట్‌లో దొరికే నిమ్మ‌ర‌సం బాటిల్స్‌ను వాడ‌ుకోవ‌చ్చునట. అయితే ఇది మరీ చాదస్తంగా భావించిన వారు కనీసం చెట్టు నుంచయినా కాయలు కోయకుండా ముందే తెచ్చుకుని ఉంచుకుని వాటిని మాత్రమే వాడుకోవాలట.

* నిద్ర

న‌వ‌రాత్రుల పాటు రోజూ ఉప‌వాసం ఉండే వారు మ‌ధ్యాహ్నం పూట అస్సలు నిద్రపోరాదట. పోతే పూజ‌లు చేసినా తగిన ఫ‌లితం లభించదట. రాత్రి వేళ మాత్రం పనులు, ఆధ్యాత్మిక కార్యకలాపాలన్నీ త్వరగా ముగించుకుని ప్రశాంతంగా నిద్రపోవాలట.

* ఉప‌వాసం

న‌వ‌రాత్రుల్లో రోజూ ఉప‌వాసం చేసే వారు కొద్ది మొత్తంలో పండ్లను ఆక‌లి అనిపించిన‌ప్పుడు తిన‌వ‌చ్చునట.

* జ‌లం

న‌వ‌రాత్రి రోజుల్లో నీటిని బాగా తాగాలట. దీంతో పాజిటివ్ ఎన‌ర్జీ క‌లుగుతుందట. ఉప‌వాసం ఉన్నా ఆక‌లి అనిపించ‌దట.

* కూర‌గాయ‌లు

ఉప‌వాసం చేసేటప్పుడు ఆలుగ‌డ్డలు, కొన్ని తాజా కూరగాయలు త‌ప్ప ఇత‌ర ఏ కూర‌గాయ‌ల‌ను తిన‌రాదట. వాటిని కూడా ఉడ‌క‌బెట్టుకుని అలాగే తిన‌వ‌చ్చునట. కానీ కూర‌లా చేసి మాత్రం తిన‌రాదని పండితులు చెబుతున్నారు.

* ఆహారం

ఉప‌వాసం చేయ‌ని వారు పాల‌ను కూర‌గాయ‌ల‌తో క‌లిపి వండి తింటే చాలా మేలు జ‌రుగుతుందట.

* తిను బండారాలు

న‌వ‌రాత్రుల్లో ఉప‌వాసం చేయ‌ని వారు రోటీ, పూరీ, ప‌కోడీ తినాలట.

* సామ అన్నం

సామ‌లు అని పిల‌వ‌బ‌డే ఓ ర‌క‌మైన తృణ‌ధాన్యం మ‌న‌కు మార్కెట్‌లో దొరుకుతుంది. దాంతో అన్నం వండి తింటే మంచి ఆరోగ్యంతో పాటు దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుందట.

* న‌ట్స్

ఫాక్స్ న‌ట్స్ అని పిల‌వ‌బ‌డే న‌ట్స్‌ను రోస్ట్ చేయాలి. అందులో నెయ్యి వేసుకుని తిన‌వ‌చ్చునట.

* చ‌క్కెర‌

న‌వ‌రాత్రి వంట‌కాల్లో చ‌క్కెర‌ను వాడ‌రాదు. బెల్లం లేదా తేనె వాడ‌వ‌చ్చునట. దీని ద్వారా శరీరానికి మంచి పోషకాలు అంది ఆరోగ్యం లభిస్తుంది.