దీపావళి రోజున అస్సలు పొరపాటున కూడా ఇలాగా చెయ్యకండి చేస్తే…ఇక

0
869

పండుగ అంటేనే విశ్వాసాలు, నమ్మకాల పునాదుల మీద ఏర్పడిన వేడుక. తర తరాలుగా ఓ తేదీ లేదా తిథి, నక్షత్రం, మరేదో ప్రత్యేక సందర్భంగా ఆధారంగా ఈ సాంప్రదాయాన్ని మన పూర్వీకులు నెలకొల్పారు. వారు సూచించిన విధంగానే మనం ఈ వేడుకలను జరుపుకుంటూ వస్తున్నాం. అందుకే శాస్త్రీయత, అశాస్త్రీయత అనే ప్రస్తావనే ఉండదు. అలాగే దీపావళి రోజు కొన్ని కార్యాలు ఎలా ఆచరిస్తారో మరికొన్నింటిని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదని హిందూ ధర్మ శాస్త్రాలు ప్రబోధిస్తున్నాయి. ఆ విషయాల గురించి తెలుసుకునే ముందుగా..

దీపావళి అంటే కేవలం టపాసులు పేల్చుకోవడం కాదు. దీపావళి రోజు లక్ష్మీదేవి పూజ చేసుకోవాలి. ఆ రోజు అమ్మవారిని ఎంత భక్తిశ్రద్దలతో పూజిస్తే అంత మంచి జరుగుతుంది. అమ్మవారిని భక్తిశ్రద్దలతో పూజించడం వలన ఆ ఇంట్లో భోగభాగ్యాలు కలుగుతాయి. ఎందుకంటే దీపావలిరోజు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఆరోజు ఆమె స్వయంగా భూలోకానికి వెళ్లాలని ఉందని, ఆ మహావిష్ణువుని కోరి మరీ భూమి మీదకి వచ్చింది. ఆరోజు దీపాలతో ఇల్లంతా అలంకరిస్తే, ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి, కొలువై ఉంటుంది. దీపావళి రోజు క్యాండిల్స్ గాని, కరెంట్ దీపాలు గాని వెలిగించడం వలన ఎలాంటి ప్రయోజనం లేదు. అవి అందానికి మాత్రమే పని చేస్తాయి. అమ్మవారు ఆనందించాలంటే మట్టి దీపాలనే వెలిగించాలి. దీపావళి రోజు అమ్మవారిని, గణపతిని పూజించాలి. పచ్చరంగు చీర కట్టుకున్న అమ్మవారిని పూజించడం వలన అంతా మంచి జరుగుతుందట. అలాగే అమ్మవారికి కొందరు చీర జాకెట్టు పెడతారు. అది కూడా పచ్చరంగు పెట్టగలిగితే మంచిది.