దీపావళి లోపు ఇంట్లో ఉన్న ఈ వస్తువులను వెంటనే పడేయండి,లేదంటే దరిద్రం వదలదు..!

0
1401

దీపావళి అంటే దీపాల పండుగ ఆరోజు కోసం ఒక్కొక్కరు ఒక్కోక్కదాని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దీపాలు వెలిగించి ఇంటిని అందంగా తయారుచేసుకోవాలని కొందరు,సెలవలు వస్తాయి అని కొందరు,స్వీట్స్ ఎక్కువగా తినొచ్చు అని కొందరు, కొత్త బట్టలు వేసుకోవచ్చు అని మరి కొందరు, బంధువులతో టపాసులు కాల్చోచ్చని మరికొందరు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క దానికోసం ఎదురుచూస్తూ ఉంటారు. కానీ అందరు కామన్ గా ఎదురు చూసేది మాత్రం ఆరోజు లక్ష్మిదేవిని పూజించి ఇంట్లోకి ఆహావనించాలి అని అనుకుంటారు. దీపావళి రోజు లక్ష్మీదేవి పుట్టిన రోజు అని అంటారు ఆరోజు విష్ణుమూర్తి ఎం కావాలి అని లక్ష్మీదేవిని అడగగా ఆమె నాకు భూలోకానికి స్వయంగా వెళ్ళి అంతా చూడాలని ఉన్నదని అందట.

దీపావళి రోజు లక్ష్మీదేవి స్వయంగా భూలోకానికి వస్తుంది లక్ష్మీదేవికి శుభ్రం అంటే చాలా ఇష్టం. అందుకనే మన ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి దీపావళికి కొన్నిరోజుల ముందు నుండి ఇంటిని శుభ్రపరిచే పని మొదలు పెట్టాలి శుభ్రపరచడానికి అన్ని రోజులు ఎందుకు ఒక్కరోజు చాలుకదా అని అనుకుంటున్నారా. శుభ్రపరచడం అంటే రోజు ఇంటిని శుభ్రం చేసినట్టు కాదు ఇంట్లో ఉన్న కొన్ని సామాన్లు తీసి బయట పడెయ్యాలి. అవి ఏమిటో తెలుసుకుందాం మనం ఏదో ఒక కారణం వలన ఇంట్లో పనికి రాని వస్తువులని ఎక్కువగా ఇంట్లో ఉంచుతాం. అలా వాడని వస్తువులని ఉంచడం వలన నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పగిలిన అద్దం ఉంచరాదు పగిలిన అద్దం ఇంట్లో ఉంచితే ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండటమే కాకుండా మనశాంతిని కోల్పోతారు. ఇంట్లో ఉన్న మంచం విరిగి ఉన్న,శబ్దాలు వస్తున్న బాగు చేయించండి లేదా బయట పడేయండి లేదంటే భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతాయి. ఆగి పోయిన గడియారం,పగిలిన గడియారం ఇంట్లో ఉంటె బాగుచేయడం లేదా బయట పడేయడం చాలా మంచిది. లేదంటే ఏపని చేసిన సరిగ్గా జరగదు,ఆటంకాలు వస్తాయి,మనకి చెడ్డ టైం వస్తుంది.

పాతబడిన ఫోటోలు ఉంటె చెదలు పట్టిన ఫోటోలు ఉన్న బయట పడేయండి. అవి నెగటివ్ ఎనర్జీని ఇంట్లోకి తెస్తాయి ఇంటికి మొఖద్వారానికి ఏది ఐన రిపైర్లు ఉంటె వెంటనే చేయించండి. ఇంట్లో పాడుయిన విరిగిన ఫర్నిచర్ ఉంటె బయట పడెయ్యండి. పిల్లలు ఆడుకునే బొమ్మలు విరిగిన పాడైన కూడా పడెయ్యండి ఇంట్లో పనికి రాని అలంకరణ వస్తువులు ఉంటె బయట పడెయ్యండి. చినిగిన బట్టలు,విరిగిన చెప్పులు అస్సలు ఉంచొద్దు లక్ష్మీదేవి ఇవి ఉంటె వెళ్ళిపోతుంది. పోయిన ఏడాది వాడిన దీపాలు మల్లి వాడొద్దు దరిద్రాన్ని తెచ్చి పెడతాయి. దీపావళికి ముందు ఇవన్నీ బయట పడేసి ఇంటిని శుభ్రపరుచుకొని మీశక్తి కొద్ది ఆ లక్ష్మిదేవిని పూజిస్తే మీఇంట్లోనే కొలువై ఉంటుంది.