నాగార్జున, దిల్ రాజు మద్య పెద్ద పెద్ద గొడవలు దానికి కారణం నాని..అసలు ఏమైనదంటే …..!

0
981

నాగార్జున తనయులు… అఖిల్, నాగచైతన్య. ఇద్దరూ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. చైతూ తనదైన స్టైల్లో సినిమాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నాడు. కానీ అఖిల్ కు మాత్రం ఇప్పటివరక సరైనా బొమ్మ పడలేదు. అఖిల్ పేరుతో తీసిని మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద బోర్లాపడింది. దీంతో ఈ యంగ్ హీరో తన ఆశలన్నీ హలో సినిమాపై పెట్టుకున్నాడు.

అయితే ఇక్కడే అఖిల్ కి ఓ ప్రాబ్లమ్ వచ్చి పడింది. హలో మూవీని సోలోగా రిలీజ్ చేయడానికి కుదరడం లేదు. అఖిల్ హలో మూవీని డిసెంబర్ 22న రిలీజ్ చేయాలని నాగ్ ఎప్పుడో డిసైడ్ చేశారు. విడుదల చేస్తోన్న ప్రతి పోస్టర్‌ మీద డేట్‌ కూడా వేస్తూ వస్తున్నారు కూడా.. అయితే డిసెంబర్ 21న నేచురల్ స్టార్ నాని నటించిన మిడిల్ క్లాస్ అబ్బాయి MCA సినిమా విడుదల కానుంది. దీంతో అఖిల్ మూవీకి నాని మోకాలు అడ్డుతున్నట్లవుతోందన్న ఫీలింగ్ లో నాగ్ ఉన్నారట. లాంగ్ వీకెండ్ రావడంతో క్రిస్మస్ సెలవుల్ని క్యాష్ చేసుకొనే పనిలో ఇద్దరు హీరోలు పోటీకి దిగుతున్నారు

హలో మూవీ ఏ సెంటర్స్ … ఓవర్సీస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేది. కాని ఈ ఏరియాల్లో నాని చాలా స్ట్రాంగ్. దీంతో నాని మూవీ మార్కెట్లో ఉంటే… అఖిల్ సినిమా ఖచ్చితంగా సెకండ్ ఛాయిసే అయ్యే ప్రమాదం లేకపోలేదు. దీంతో అఖిల్ మూవీకి వచ్చే కష్టాల్ని తల్చుకుని నాగ్ వెంటనే దిల్ రాజుతో మాట్లాడారని సమాచారం. నాని సినిమాను కాస్త ముందుకో వెనక్కో జరపాలని కోరినట్లు సినీవర్గాల టాక్. అయితే దీనికి దిల్ రాజు నో చెప్పారట. ఎంసిఏని డిసెంబర్‌ 21న విడుదల చేయాలని దిల్‌ రాజు కూడా ముందే డిసైడ్ అయ్యాడు. హలో డేట్ అనౌన్స్ చేసిన తర్వాత నాని మూవీ వాయిదా వేయాలని అనుకున్నా… ఓవర్సీస్‌లో క్రిస్మస్‌ టైమ్‌కి వచ్చే సినిమాకి వుండే అడ్వాంటేజ్‌ తెలియడంతో ఆ ఆలోచన మానుకున్నాడు. తర్వాత సంక్రాంతికి వాయిదా వేయడానికి కూడా ప్లాన్‌ చేసారు. కానీ థియేటర్ల కొరత వుంటుంది కనుక అదీ వదిలేసుకున్నారు.

దీంతో డిసెంబర్‌ 21కే ఎంసిఏ రిలీజ్‌ పక్కా అయింది. తన సినిమా నష్టపోతుందని, ముందుకి, వెనక్కి వెళ్లే ఆస్కారం లేదని తేల్చేసిన దిల్ రాజు… పోటీ తప్పదంటూ.. నానితో ట్వీట్ కూడా చేయించారు. పైగా క్లాష్‌ తెలుగు సినిమాల మధ్య కాదని, సల్మాన్‌ ఖాన్‌ సినిమాతో అని తెలివితేటలు కూడా చూపించారు. ఏదేమైనా నాని సినిమాతో దిల్ రాజు, నాగార్జున మధ్య అగ్గిరాజేసిందని సినీ వర్గాల మాట.