ఉద్యోగాలు
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి ఉద్దేశించిన ఉమ్మడి నియామకపు ప్రక్రియ (సీడబ్ల్యూఈ క్లర్క్స్ – VII)కు ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 7,883 పోస్టులను నింపనున్నారు. అందులో తెలంగాణకు 344, ఆంధ్రప్రదేశ్‌కు 485 పోస్టులు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంకుల వారీ ఖాళీలు: అలహాబాద్ బ్యాంక్ 4, ఆంధ్రా బ్యాంక్ 247, బ్యాంక్ ఆఫ్ బరోడా 50, బ్యాంక్ ఆఫ్ ఇండియా 6, కెనరా బ్యాంక్ 20, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 23, కార్పొరేషన్ బ్యాంక్ 15, దేనా బ్యాంక్ 13, ఇండియన్ బ్యాంక్ 72, యూకో బ్యాంక్ 8, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 27
తెలంగాణలో:
అలహాబాద్ బ్యాంక్ 5, ఆంధ్రాబ్యాంక్ 181, బ్యాంక్ ఆఫ్ బరోడా 45, బ్యాంక్ ఆఫ్ ఇండియా 5, కెనరా బ్యాంక్ 20, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 16, కార్పొరేషన్ బ్యాంక్ 10, దేనా బ్యాంక్ 12, ఇండియన్ బ్యాంక్ 28, యూకో బ్యాంక్ 6, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 16
అర్హత: డిగ్రీ పాస్. ఆయా ప్రాంతాల స్థానిక భాషల్లో ప్రావీణ్యం ఉండాలి.
వయసు: సెప్టెంబరు 1 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్
ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్: డిసెంబరు 2, 3, 9, 10 తేదీల్లో
ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామ్: 2018 జనవరి 21న
ప్రావిజనల్ అలాట్‌మెంట్: 2018 ఏప్రిల్‌లో
తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: చీరాల, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్
తెలుగు రాష్ట్రాల్లో మెయిన్ ఎగ్జామ్ కేంద్రాలు: గుం టూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్.
దరఖాస్తు ఫీజు: రూ.600(ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.100) ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: సెప్టెంబరు 12 నుంచి అక్టోబరు 3వరకు