25న ఈ-కామర్స్ ఆధ్వర్యంలో భారీ జాబ్‌మేళా..
రాస్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించే నిమిత్తం ట్రేడ్ హైదరాబాద్ డాట్‌కామ్ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన ఈ-కామర్స్ మార్కెటింగ్ ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ సీవోవో శ్రీలత తెలిపారు. మార్కెటింగ్, నెట్‌వర్కింగ్ మార్కెటింగ్, ఈవెంట్ మేనేజ్‌మెంట్, టెలిమార్కెటింగ్, బిజినెస్ డెవల్‌పమెంట్, డిజిటల్ మార్కెటింగ్ రంగాల్లో ఉన్న పలు ఉద్యోగ అవకాశాల కోసం డిగ్రీ లేదా ఎంబీఏ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ జాబ్‌మేళాలో పాల్గొనవచ్చని చెప్పారు. ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెలా రూ.24వేల నుంచి రూ.32వేల వరకు వేతనం, టీఏ, డీఏ, బిజినెస్ అలవెన్సులతో ఉద్యోగాల్లోకి తీసుకుంటామని ఆమె తెలిపారు. మరింత సమాచారం కోసం.. 7337556150 నంబర్‌లో సంప్రదించాలని శ్రీలత తెలిపారు.