నేలకు నిచ్చెన వేసి భువికి దిగివచ్చిన దేవకన్యవో.. అన్నట్టుగా ఉంది టాలీవుడ్ టాప్ హీరోయిన్, అక్కినేని ఇంటి కోడలు “సమంత” ఈ మధ్య “జానూ” సినిమా ఈవెంట్స్ లో చీరకట్టుతో ప్రేక్షకులకు మతిపోగొడుతోంది. పెళ్లి తరువాత కూడా ఈ అందాల భామ కుర్రకారు హృదయాల్లో రైల్లు పరిగెట్టిస్తోంది. ఆమెకంటూ ప్రత్యేక అభిమానులు సంపాదించుకుంటుంది.
హీరో శర్వానంద్, టాలీవుడ్ క్వీన్ సమంత అక్కినేని జంటగా నటించిన చిత్రం జాను. 2019 రిలీజ్ అయినా రణరంగం సినిమా తరువాత శర్వానంద్ చేస్తున్న చిత్రం ఇదే. ఓ..బేబీ తరువాత సమంత నటించిన చిత్రం ఇదే.. అయితే ఈ సినిమా విజయ్ సేతుపతి, త్రిష నటించిన ఈ చిత్రం, తమిళనాట సంచలన విజయం సాధించిన 96 సినిమాకు రీమేక్. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా.. “96” చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ “జానూ” సినిమాకి కూడా ఈయనే దర్శకుడిగా కొనసాగుతున్నారు.
అయితే దాదాపు చిత్రీకరణ పూర్తీ చేసుకున్న ఈ చిత్రం, ఇది వరకే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. మొన్న ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ బుధవారం రిలీజ్ చేసింది ఈ చిత్ర బృందం. నిన్న సినిమాలోని పాటలు రిలీజ్ చేసింది. ఎమోషనల్ ప్రేమ కధగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో సమంత, శర్వానంద్ తమ పాత్రలలో ఒదిగిపోయినట్టు కనిపిస్తున్నారు. నటనలో ఇద్దరు పోటీపడి చేసినట్టున్నారు.
గోవింద్ వసంత ఈ చిత్రానికి సంగీతాన్ని ఆడించాడు. తమిళంలో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం భారీ విజయం సొంతం చేసుకుంది. తెలుగులో కూడా అలాంటి మ్యాజిక్ రిపీట్ అవుతుందని చిత్రం యూనిట్ భావిస్తున్నారు.
కుర్ర కారు మతిపోగొడుతున్న సమంత లేటెస్ట్ ఫొటోస్ మీకోసం








