పండుగ ఆఫర్‌:జియో డివైజ్ పై 50శాతం డిస్కౌంట్‌

0
917

దసరా స్పెషల్:‘జియోఫై’ పై భారీ డిస్కౌంట్‌ పండుగ ఆఫర్‌:జియో డివైజ్ పై 50శాతం డిస్కౌంట్‌

దసరా పండగ డిస్కొంట్ రేసులోకి వచ్చింది జియో. అన్ని ఈ-కామర్స్ షాపింగ్ దిగ్గజాలు ఆఫర్స్ తో వెల్లువెత్తుతున్న టైంలో.. టెలికాం మార్కెట్లో ఇప్పటికే సంచలనం సృష్టిస్తోన్న రిలయన్స్‌ జియో తమ ఖాతాదారులకు మరో బంపర్‌ ఆఫర్‌ ను దసర కానుకగా అందుబాటులోకి తెచ్చింది. డివైజ్ లపై ఫిఫ్టీ పర్సంట్ డిస్కొంట్ ఇచ్చింది. హాట్‌స్పాట్ డివైజ్ను కేవలం రూ.999కే అందిస్తున్నది. అసలు ధర రూ.1,999. రూ. 1000 డిస్కౌంట్‌ తో పదిరోజుల పాటుచెల్లుబాటయ్యేలా పండుగ ఆఫర్‌ను లాంచ్‌ చేసింది. పండుగ కానుకగా ఈ ఆఫర్‌ ప్రవేశపెట్టింది. దీంతో రూ.1,999 ధ‌ర ఉన్న డివైజ్ను ఇప్పుడు కేవ‌లం రూ.999 ధ‌ర‌కే కొనుగోలు పొందవచ్చు. సెప్టెంబర్ 20 నుంచి 30 వరకు అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత పాత ధర ఉంటుందని ప్రకటించింది జియో.

4జీ ఫోను లేకపోయినా 4 జీ వేగంతో డేటా, కాలింగ్ సదుపాయాలు పొందగలిగే సౌకర్యాన్ని జియో ఫై కల్పిస్తుంది. అలాగే వినియోగదారులు 3జీ లేదా 2జీ స్మార్ట్ ఫోన్లలో, లాప్ టాప్ లలో జియో యొక్క అద్భుతమైన సేవలను పొందవచ్చు. దీనితో కుటుంబ సభ్యులు లేదా చిన్న సంస్థలోని సిబ్బందిని జియో డిజిటల్ లైఫ్ కి అనుసందానం చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్లు, లాప్టాప్ లు, టాబ్లెట్ తదితర 10 నుంచి 32 వై ఫై పరికరాలను జియో ఫై తో అనుసంధానం చేసుకోవచ్చు.

జియోఫై ఎలా పనిచేస్తుంది?

2జీ, 3జీ ఫోన్లలో జియో ఎలా పనిచేస్తుందనే సందేహం చాలా మందికి కలగవచ్చు. ప్రతీ జియో ఫై తో ఒక జియో సిమ్ వస్తుంది. ఈ పరికరంలో సిమ్ వేసిన తరువాత ఇది వై ఫై హాట్ స్పాట్ గా పనిచేస్తుంది. ఆ తరువాత ‘జియో 4జీ వాయిస్’ అప్లికేషన్ ను ప్లే స్టోర్ నుండి మీ 2జీ, 3జీ స్మార్ట్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని గంటల్లో సిమ్ ఆక్టివేట్ కాగానే జియో ఫై ద్వారా ఫ్రీ వాయిస్ కాల్ సేవలు, 4 జీ డేటా సేవలను పొందవచ్చు. కాల్ చేసిన వ్యక్తికి మీ 10 అంకెల జియో ఫై నంబరు కనపడుతుంది. తిరిగి ఈ వ్యక్తి మీకు ఈ నంబరు కు కాల్ చేయవచ్చు. దీనితో, వోల్ట్‌ ద్వారా వీడియో, హెచ్‌డీ కాల్స్, ఇప్పుడు 2జీ/ 3జీ స్మార్ట్ ఫోన్లలో అందుబాటులో ఉంటాయి. అంతేకాదు వినియోగదారులు స్పష్టమైన హెచ్‌డీ వాయిస్ తో జియో నెట్ వర్క్ లో ఉండే వారితో మాట్లాడగలరు.