Connect with us

Featured

పరగడుపున ఎట్టిపరిస్థితిలో ఈ పనులు చెయ్యకండి.. చాలా ప్రమాదం

Published

on

ఆహారాన్ని మితంగా తీసుకుంటే ఔషధం. అతిగా తింటే విషం’ అన్న సంగతి మనకి తెలిసిందే.ఇవి తినండి, అవి తినకండి అని డాక్టర్లు సలహాలు ఇస్తుంటారు. అవన్నీ గుర్తుంచుకుని పాటించడం కాస్త కష్టమే. అయినా అన్నీ బుర్రతోనే గుర్తుపెట్టుకోవాలనేముందీ? ఈ పది పదార్థాలనీ కళ్లతో స్కాన్‌ చేసేయండి. పరగడుపునే తినడం మానేయండి. తింటే ఏమవుతుందో కూడా తెలుసుకోండి. ఇవీ డాక్టర్లు చెప్పినవే. సందేహించకుండా ఫాలో అవండి.

స్వీట్లు..ఉదయాన్నే చిన్న చాక్లెట్‌ నోట్లో వేసుకుంటే బుర్ర ఫ్రెష్‌గా ఉంటుందని వైద్యంలో ఓ థియరీ! దాన్నొదిలేయండి. ఉదయాన్నే కడుపులోకి తీపి పదార్థాలు వెళ్తే ఒంట్లో ఇన్సులిన్‌ లెవల్స్‌ ఎక్కువౌతాయి. దీనర్థం ఏమిటంటే.. షుగర్‌ను కంట్రోల్‌ చేసే హార్మోన్‌ అయిన ఇన్సులిన్‌… పరగడుపునే వచ్చి పడిన స్వీట్‌ని కంట్రోల్‌ చెయ్యడానికి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దాంతో ఇన్సులిన్‌ని ఉత్పత్తి చేసే పాంక్రియాస్‌ గ్రంథి మీద లోడ్‌ ఎక్కువౌతుంది. ఇలా లోడ్‌ పెరుగుతూ పోతుంటే డయాబెటిస్‌ వచ్చేస్తుంది!

Advertisement

పేస్త్రీలు, పఫ్‌ పేస్త్రీలు…ఉదయాన్నే ఇవి ఎవరు తింటారండీ బాబూ అని మీరు అనుకోవచ్చు. రాత్రి తిన్నవి తినగా మిగిలిపోతే.. ఎవరో ఎందుకు మీరే తింటారు తెలుసా! సరే, తిన్నాక ఏం జరుగుతుంది? కడుపులోపలి మృదువైన పొర ల్లో మంట రేగుతుంది. గ్యాస్‌ ఫామ్‌ అవుతుంది. కడుపుబ్బరం వచ్చేస్తుంది. త్రేన్పులు వస్తాయి. ఉదయాన్నే వీటిని అలవాటుగా తినేవారికి అనతికాలంలోనే కడుపులో ఐపీఎల్‌ (మ్యాచ్‌ అన్నమాట) స్టార్ట్‌ అవుతుంది.

పెరుగు, పులియబెట్టిన పాల పదార్థాలు…పరగడుపునే పెరుగు తినేస్తే కడుపులో హైడ్రోక్లోరిక్‌ ఆసిడ్‌ల మోతాదులు ఎక్కువౌతాయి. ఈ ఆసిడ్‌లు ఏం చేస్తాయంటే.. మనకు మేలు చేసే లాక్టిక్‌ ఆసిడ్‌ బాక్టీరియాను చంపేస్తాయి. ఆ కారణంగా తిన్నదేదీ ఒంటికి పట్టదు. అంటే.. పోషకాలను లోనికి లాక్కునే శక్తిని మన బాడీ కోల్పోతుంది. పెరుగు ఒక్కటే కాదు. పాలతో చేసినవి ఏవి తిన్నా ఇంతే.

దోసకాయలు, పచ్చని కాయగూరలు….దోసకాయలు, ఇతర కాయగూరలు పచ్చివి తింటే ఆరోగ్యం అని మీరు వినే ఉంటారు. కానీ… ఖాళీ కడుపుతో తింటే.. ఈ మంచివి కూడా చెడ్డవి అయిపోతాయి! కడుపులో గ్యాస్‌ ఉత్పత్తి అవుతుంది. కడుపు నొప్పి, ఛాతీనొప్పి కూడా వస్తాయి.

Advertisement

పియర్స్‌ (బేరీ పండ్లు)…ఇప్పుడివి మార్కెట్‌లో బాగా కనిపిస్తున్నాయి. సేమ్‌ ఇవే కాకున్నా, ఈ జాతి పండ్లు విరివిగా దొరుకుతున్నాయి. చూడగానే ఆకర్షించడం ఈ పండ్ల ప్రత్యేకత. ఉదయాన్నే మాత్రం మీరు వీటి ఆకర్షణకు లోను కాకండి. బేరీ çపండ్లలోని ముతగ్గా (రఫ్‌గా) ఉండే పీచుపదార్థం మీ ఖాళీ కడుపులోని మృదువైన మ్యూకస్‌ మెంబ్రేన్‌ ని గిన్నెల్ని తోమినట్టు తోమేస్తుంది. ఫలితం.. కడుపులో ట్వంటీ ట్వంటీ.

పుల్లని పండ్లు..నారింజ, ఇతర పుల్లని పండ్లలో టన్నులకొద్దీ ఆసిడ్లు ఉంటాయి. వాటిని సాధారణ పరిభాషలో ఫ్రూట్‌ ఆసిడ్స్‌ అంటారు. పరగడుపునే వీటిని తినడం అస్సలు మంచిది కాదు. గ్యాస్ట్రైటిస్, గ్యాస్ట్రిక్‌ అల్సర్లు, హార్ట్‌ బర్న్‌.. ఇదిగో ఇలాంటివన్నీ వచ్చేస్తాయి.

శీతలపానీయాలు…అంటే.. కూల్‌ డ్రింక్స్‌. వీటిల్లో టేస్ట్‌ కోసం కొద్దిగానైనా కార్బన్‌డైఆక్సైడ్‌ని చొప్పిస్తారు. అందుకే వీటిని కార్బొనేటెడ్‌ డ్రింక్స్‌ అంటారు. అందరికీ తెలిసిన పేరు ‘సాఫ్ట్‌ డ్రింక్స్‌’. ఉదయాన్నే ఖాళీ కడుపుతో సాఫ్ట్‌ డ్రింక్‌ తాగితే కడుపు హార్డ్‌ అయిపోతుంది. బిగుసుకుపోతుందని కాదు. కడుపు మన మాట వినదని. మరి వీటిల్లోని కెఫీన్‌ రోజంతా మనల్ని ఉత్సాహంగా ఉంచుతుంది కదా అని మీకు డౌట్‌ రావచ్చు. ఆక్చువల్లీ కెఫిన్‌ ఇంకో పని కూడా చేస్తుంది. పేగుల లోపలి కణజాలాన్ని దెబ్బతీస్తుంది. దాంతో కడుపు కండరాలకు రక్తం సరఫరా మందగించి జీర్ణక్రియల శక్తి సన్నగిల్లుతుంది. ఏదైనా జీర్ణం కాకపోతే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా! త్రేప్పులు, గుండె మంట వగైరా.

Advertisement

టమాటాలు..టమాటా జ్యూస్‌ ఆకలిని రేకెత్తిస్తుందని అంటారు. నిజమే. స్టార్టర్‌గా కొన్నిచోట్ల భోజనానికి ముందు టమాటా సూప్‌ ఇస్తారు. అయితే చేదునిజం ఏమిటంటే.. ఖాళీ కడుపుతో టమాటా జ్యూస్‌ను తీసుకుంటే టమాటాల్లోని ట్యానిక్‌ ఆసిడ్‌లు అసిడిటీని పెంచి, పేగులు పుండ్లు పడేలా చేస్తాయి.

అరటిపండ్లు..ఒంట్లో మెగ్నీషియం ఎక్కువైతే గుండెకు హాని కలుగుతుంది. అరటిపండ్లలోని ఒక చెడ్డ గుణం ఏమిటంటే… అవి ఒంట్లోని మెగ్నీషియం మోతాదులను సర్రున పెంచేస్తాయి. వట్టప్పుడు తింటే ఏం కాదు కానీ, పరగడుపున అరటిపండ్లను తింటే మాత్రం మన లోపలి మెగ్నీషియంకు ఇక అడ్డూఆపూ లేకుండా పోతుంది.

మసాలాలు…అసలు విలన్‌ దగ్గరికి వచ్చేశాం. మసాలాలు అంటే.. స్పైసీ ఫుడ్‌. ఉదయాన్నే బ్రెష్‌ చేసుకున్న వెంటనే ఆకలిగా ఉందని చెప్పి.. అమ్మడు.. కుమ్ముడు టైప్‌లో స్పైసీ ఫుడ్డుని లాగిస్తే గొంతు నుంచి కడుపు వరకు పిచ్‌ రెడీ అయిపోతుంది. నానా రకాల గ్యాస్‌లు జట్లుగా విడిపోయి ఇష్టం వచ్చినట్టు బ్యాటింగ్, బౌలింగ్‌ చేసేస్తుంటాయి. కాబట్టి ఖాళీ కడుపుతో తినేముందు కాస్త జాగ్రత్త వహించడం మంచిది.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Pushpa 2: పుష్ప 2 లో చీర కట్టుకొని ఆ పని చేయలేకపోయిన బన్నీ… అదే హైలెట్ అయ్యిందా?

Published

on

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు. ఇక ఆస్కార్ అవార్డు టార్గెట్ గా ఈ సీక్వెల్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.

ఇక పుష్ప సినిమా ఆగస్టు 15వ తేదీ విడుదల కానున్న సందర్భంగా ఇటీవల అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో ఈ సినిమా నుంచి టీజర్ వీడియో విడుదల చేశారు .ఈ టీజర్ వీడియోలో అల్లు అర్జున్ ఏకంగా అమ్మవారి గెటప్ లో చీర కట్టుకొని ఒక యాక్షన్ సీక్వెన్స్ చేయబోతున్నారని వీడియో చూస్తేనే అర్థమవుతుంది.

నటన పరంగా ఎలాంటి కష్టమైనా అనుభవిస్తూ 100% ఆ పాత్రలకు న్యాయం చేసే అల్లు అర్జున్ ఈ సినిమా విషయంలో మాత్రం చీర కట్టుకొని ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలుస్తుంది. సాధారణంగా చీర కట్టుకొని నడవడం అంటే చాలా కష్టంగా ఉంటుంది కానీ అల్లు అర్జున్ ఏకంగా యాక్షన్ సన్ని వేశాలలో నటించారు.

Advertisement

చీరలో ఫైట్..
ముఖ్యంగా ఈయనకు చీర కట్టుకొని ఫైట్ చేయడం ఎంతో కష్టతరంగా మారిందట కానీ ఆ యాక్షన్ సీక్వెన్స్ కి 100% న్యాయం చేసేలా ఈయన ఎంతో కష్టపడుతూ కేవలం ఈ సీక్వెన్స్ పూర్తి చేయడానికి సుమారు 51 టేకులు తీసుకున్నారని తెలుస్తోంది. ప్రతి సన్నివేశం కూడా స్పష్టంగా రావడం కోసం ఈయన ఇంతగా కష్టపడ్డారట మరోవైపు చీరలో అలవాటు లేకపోవడంతో ఇన్ని టేక్స్ తీసుకున్నారని తెలుస్తోంది అయితే చివరికి ఈ సీన్ చాలా హైలైట్ గా మారబోతుందని తెలుస్తుంది.

Advertisement
Continue Reading

Featured

Rakul Preeth Singh: హైదరాబాద్లో మరో బిజినెస్ ప్రారంభించిన రకుల్.. స్పీడ్ పెంచుతున్న నటి!

Published

on

Rakul Preeth Singh: రకుల్ ప్రీత్ సింగ్ పరిచయం అవసరం లేని పేరు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఉన్నటువంటి ఈమె సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా నటిగా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు..

బాలీవుడ్ నటుడు నిర్మాత అయినటువంటి జాకీ భగ్నాని అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నటువంటి ఈమె పెళ్లి తర్వాత కెరియర్ పై ఫోకస్ పెట్టడమే కాకుండ వ్యాపార రంగంలో కూడా దూసుకుపోతున్నారు. ఇప్పటికే వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టినటువంటి ఈమె జిమ్ ను కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఎంతోమంది సెలబ్రిటీలు ఈమె జిమ్ కి వెళ్తూ ఉంటారు. ఇలా పలు వ్యాపారాలలో బిజీగా ఉంటూ వ్యాపారవేత్తగా కొనసాగుతూ ఉన్నటువంటి ఈమె త్వరలోనే హైదరాబాద్లో మరో వ్యాపారం ప్రారంభించబోతున్నారని తెలుస్తుంది. ఇటీవల ఈమె హెల్త్ అండ్ టేస్టీ అంటూ ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

రెస్టారెంట్ బిజినెస్..
ఈ వీడియో చూసి బహుశా ఈమె రెస్టారెంట్ బిజినెస్ పెట్టబోతున్నారా అని అందరూ ఆ సందేహాలు వ్యక్తం చేశారు అయితే తాజాగా ఈ బిజినెస్ రెస్టారెంట్ బిజినెస్ అని తెలుస్తుంది .హైదరాబాద్ ఆరంభం అనే పేరిట ఈ రెస్టారెంట్ ప్రారంభించబోతున్నారని ఈ రెస్టారెంట్లో కేవలం మిల్లెట్ తో తయారు చేసిన ఫుడ్ మాత్రమే లభించబోతుందని తెలుస్తుంది.

Advertisement
Continue Reading

Featured

Kajal Agarwal: దర్శక నిర్మాతలకు తలనొప్పిగా మారిన కాజల్.. అలాంటి కండిషన్లతో షాప్ ఇస్తోందిగా?

Published

on

Kajal Agarwal: వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. లక్ష్మి కళ్యాణం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె అనంతరం తెలుగు తమిళ భాష చిత్రాలలో స్టార్ హీరోయిన్ గా కొనసాగారు.

ఇలా ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరి సరసన నటించినటువంటి కాజాల అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత వెంటనే ఈమెకు పిల్లలు కూడా కావడంతో ఇండస్ట్రీకి చిన్న విరామం ప్రకటించారు ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తున్నారు.

ఇటీవల బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే సత్యభామ అనే సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఈమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నటువంటి తరుణంలో దర్శక నిర్మాతలకు షాక్ అయ్యే కండిషన్లు పెడుతూ వస్తున్నారు.

Advertisement

రెమ్యూనరేషన్ తగ్గించుకుంటా..
ఎంతోమంది దర్శకనిర్మాతలు సినిమా అవకాశాలతో కాజల్ ను సంప్రదించగా ఆమె ఎన్నో కండిషన్స్ పెడుతున్నారట. ముఖ్యంగా ఈమె నటించే సన్నివేశాలలో రొమాంటిక్ సన్నివేశాలకు గ్లామర్ కి తావు లేకుండా ఉండాలని కండిషన్ పెడుతున్నారు. ఇక పోతే తాను లిప్ కిస్, బెడ్ రూమ్ సన్నివేశాలలో కూడా నటించనని తేల్చి చెప్పారట అవసరమైతే తన రెమ్యూనరేషన్ తగ్గించుకుంటాను కానీ ఇలాంటి సన్నివేశాలలో నటించను అంటూ కాజల్ చెప్పడంతో దర్శక నిర్మాతలు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!