పార్కింగ్ ఫీజు వసూలు చట్టరిత్యా నేరం.. అందరికి తెలిసేలా చేయండి…

0
1284

పార్కింగ్ ఫీజు వసూలు చట్టరిత్యా నేరం.. అందరికి తెలిసేలా చేయండి…

నిబంధనల ప్రకారం ప్రతి కమర్షియల్ బిల్డింగ్(షాపింగ్ మాల్స్, థియేటర్స్) తప్పని సరిగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలి. పార్కింగ్ స్థలాలను ఎలాంటి లీజుకు ఇచ్చే హక్కు లేదు. ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన స్థలాల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయకూడదు అని రూల్స్ ఉన్నా పట్టించుకొనేవారేలేరు..

పార్కింగ్ ఫీజు వసూలు అనేది నిబంధనలకు విరుద్ధమని.. చట్టబద్ధత లేని వ్యవహారమని తేల్చిచెప్పింది హైకోర్టు. అంతేకాదు ఏపీ అపార్ట్ మెంట్స్ యాక్ట్ 1987 సెక్షన్ 24 కూడా ఇదే చెబుతోంది. 1998లో విడుదలైన జీవో నెం. 423 ప్రకారం కమర్షియల్ బిల్డింగ్ లో 44శాతం కామన్ ఏరియాగా వదిలేయాలని చెబుతోంది. ఇలా వదిలేసినందుకు ప్రతిగా ప్రభుత్వం రాయితీలు కల్పిస్తుంది కూడా. ఈ కామన్ ఏరియా నుంచి బిల్డర్లు ఎలాంటి ప్రయోజనాలు పొందకూడదు. ఈ నిబంధనను ఆచరణలోకి తేవాల్సిన బాధ్యత జీహెచ్ఎంసీకి ఉన్నా.. ఏం పట్టింపులేనట్టు వ్యవహరిస్తుంది.

పార్కింగ్ ఫీజు.. షాపింగ్ మాల్, కూరగాయల మార్కెట్, సినిమా హాల్, పార్క్.. ఇలా ఎక్కడికి వెళ్లినా.. ఈ బాదుడు తప్పదు. పబ్లిక్ కోసం ఏర్పాటు చేసిన స్థలంలో ఈ ఫీజులేంటిరా అన్నా ఎవరూ పట్టించుకోరు. పైపెచ్చు తీయండి బాస్ అంటూ గదమాయిస్తుంటారు. కోర్టులు, చట్టాలు వద్దని చెబుతున్నా ఈ వసూళ్లు ఆగడంలేదు..

హైదరాబాద్ కు చెందిన విజయ్ గోపాల్ అనే వ్యక్తి… పార్కింగ్ ఫీజు వసూలుపై ఆగస్ట్ 26న మాదాపూర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. కేవలం 10 నిమిషాల కోసం తన దగ్గరి నుంచి రూ.30లు వసూలు చేశారని ఇనార్బిట్ షాపింగ్ మాల్ పై కేసు పెట్టారు. షాపింగ్ మాల్స్ జేబులు గుళ్ల చేస్తున్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు విజయ్ గోపాల్. అంతేకాదు తనకు ఇచ్చిన పార్కింగ్ ఫీజు రశీదులో జీఎస్టీ ఉండటం మరింత ఆగ్రహానికి గురి చేసిందన్నారాయన. ప్రభుత్వాల జీవోలు, హైకోర్టుల ఉత్తర్వులను షాపింగ్ మాల్స్, థియేటర్ల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని.. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.