పిజ్జా ఆర్డర్ చేసిన పాపానికి రాత్రంతా నరకం చూసిన యువతీ..

0
901

మారుతున్న టెక్నాలజీ లో బాగంగా చాలా మంది ఏ వస్తువు కావాలన్నా ఆన్లైన్ లోనే బుక్ చేసుకుంటున్నారు.ఒకవేళ వచ్చిన తరువాత ఆ వస్తువు నచ్చకపోతే వాపస్ ఇవ్వవచ్చు.అయితే ఇలా ఆన్లైన్లో కొన్న వస్తువును కొన్న ఒక యువతి అది మచ్చక దాన్ని రిటర్న్ చేయడానికి నరకం చూసింది వివరాల్లోకి వెళితే..బెంగళూర్ JP నగర్ కి చెందిన ఓ యువతి ఆన్లైన్లో పిజ్జా అర్దర్ చేయడంతో డెలివరీ బాయ్ రాత్రి 10 గంటల ప్రాంతంలో పిజ్జా ను తీసుకొచ్చాడు.

డెలివరీ బాయ్ డోర్ కొట్టడంతో డోర్ తీసింది ఆ యువతి అయితే అది చూసిన ఆ యువతి తన ఆర్డర్ చేసిన పిజ్జా కాకుండా వేరేది తెచ్చాడని నచ్చలేదని వాపస్ తీసుక పోవాలని అతనితో చెప్పింది దానికి అతడు ఒప్పుకోలేదు అయితే ఆ యువతి డోర్ మూసేసి లోపలకు వెళ్లిపోయింది.దీంతో ఆ డెలివరీ బాయ్ కి కోపం వచ్చి ఆ పైజ్జాను అక్కడే పెట్టీ ఒక పదినిమిషాల తరువాత ఆమెకు ఫోన్ చేసి బండ బూతులు తిట్టాడట .అంతేకాక ఆమె ఫోన్ నెంబర్ ను ఆ డెలివరీ బాయ్ తన వాట్స్ ఆప్ గ్రూపుల్లో పోస్ట్ చేసి ఈమె ఒక వేశ్య అని రేటు మాట్లాడుకొని వెళ్ళవచ్చు అని పెట్టాడట .దీంతో అందరూ ఆమెకు ఫోన్ చేసి వేదించారట దీంతో ఆమె పోలీస్ లకు ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్ట్ చేశారట పోలీసులు.