పుట్టను తవ్వి అమెరికా వెళ్ళాడు..అ పాము ఏం చేసిందంటే…!!

0
2001

పాములకు చెవులు వినబడవు అని అంటుంటారు అలాగే అవి పగబడుతాయని కూడా అంటారు..పాము పగ పడితే తప్ప కాటేస్తుంది అంటారు.అయితే దీనికి సాక్షిగా గుంటూరు జిల్లాలో జరిగిన ఒక యదార్ధ ఘటన గురించి తెలుసుకుందాం .

గుంటూరు జిల్లాకు చెందిన ఆదిశేషు ఒక పెద్ద రైతు బాగా సంపన్న కుటుంబం తన కొడుకు అమెరికా లో స్థిరపడ్డాడు అయితే కొడుకు పంపిన డబ్బుతో తన పొలం పక్కనే మరో పొలం కొన్నాడు అయితే ఈ రెండు పొలాల మద్య గట్టులు పొదలు అలాగే చెట్టు ఉన్నాయి వాటన్నిటినీ కూలీలను పెట్టి తొలగిస్తున్నారు .ఈ క్రమంలో అక్కడ ఉన్న చెట్టు కు పుట్ట ఉంది కూలీలంత ఆదిశేషు కు చెప్పడంతో అక్కడకు వచ్చి ఆ పుట్టను త్రవ్వడం తో ఒక తల్లి పాము పిల్ల పాము ఒకటి బయటకు వచ్చింది.దీంతో పిల్ల పామును ఆదిశేశు కాలుతో తొక్కిపెట్టి కర్రతో చంపేశాడు కానీ తల్లి పాము పారిపోయి ఒక పొడల్లో నుండి ఇదంతా గమనిస్తుంది.సాయంత్రం కాగానే వారంతా ఇంటికి వెళ్ళిపోయారు.అదే రోజు సాయంత్రం అతని కొడుక్కి యాక్సిడెంట్స్ అయిందని కాల్ రావడంతో అతను వెంటనే అమెరికా వెళ్ళిపోయాడు

అమెరికాలోనే 5 సంవత్సరాల పాటు ఉండాల్సి వచ్చింది.దీంతో పొలాలను కౌలుకు ఇచ్చాడు.అయితే కొన్ని సంవత్సరాల తరువాత ఆ ఊరిలో శివలింగ ప్రతిష్ట ఉంది తప్పక రావాలని గ్రామస్తులు కోరడంతో గ్రామానికి వచ్చాడు.తెలారి పొలం చూసి వద్దామని ఆదిశేషు పోలం దగ్గరకు వెళ్ళగా అక్కడ ఉన్న కూలీలు నమస్తే శేషయ్య అంటూ ఉంటే అది విన్న ఆ తల్లి పాము కోపంతో అక్కడే ఉన్న చెట్టుపై ఎగిరెగిరి పడుతూ శేషయ్య ను ఎప్పుడు కాటేయాలా అనే ఉక్రోషంతో ఉంది ఆ పాము కదలడానికి కూడా ఓపిక లేదు కానీ తమ కళ్ల ముందే పిల్ల పామును చంపడం తో ఎలాగైనా ఆ శేషయ్య ను చంపాలని బ్రతుకుతుంది.ముసలోడి అయిన పాము శేషయ్య చెట్టుకింద కు రాగానే ఒక్కసారిగా అతని పై పడింది వెంటనే శేషయ్య దాన్ని తీసి దూరంగా విసిరేశాడు.దాంతో అక్కడున్న వారు చంపడానికి కర్రలు తీసుకొని వస్తుండగా వద్దని ఆపేశాడు వారిని.ఓపిక తెచ్చుకొని మెల్లగా ఆ పాము.అతనివైపు రాసాగింది చివరకు అది శేషయ్య కాలు దగ్గరకు రాగానే చనిపోయింది దీంతో శేషయ్య తనపిల్లను చంపినందుకు పగ బట్టి ది అని గ్రహించి అక్కడ ఒక రాతి విగ్రహం మీద ఆ రెండు పాముల ప్రతిమలు చేయించి అక్కడ ప్రతిష్టించి ఇంటికి వెళ్లి స్నానం చేసి శివాలయంలో శివ లింగాన్ని ప్రతిష్ఠించాడు.ఇదంతా పరమేశ్వరుడు వల్ల జరిగింది అని నమ్ముతాడు ఆదిశేషు.ఇప్పటికీ అక్కడ పూజలు చేస్తారు.