పెరుగులో ఇవి కలిపి తింటే జరిగే అద్భుతాలు తెలిస్తే..తినకుండా ఉండలేరు

0
1211

మంచి పెరుగు ఇప్పుడు దొరకడం కూడా కష్టమైపోయింది. కాని.. మన పెద్దవారిని అడిగితే చెబుతారు పెరుగు చేసే గొప్ప మేలు గురించి.. అసలు పెరుగు లేకుండా వారికి పూట కూడా గడిచేది కాదని కూడా అంటుంటారు.. తాము పెరుగు వేసుకోకుండా భోజనం ముగించేవారం కాదని. మరి ఇప్పుడో? వారంలో ఎన్నిరోజులు పెరుగు తింటున్నాం? అందులో నాణ్యత ఎంత? అనేది తరచి చూసుకోవాల్సి వస్తోంది. అసలు పెరుగుతో భోజనాన్ని ముగించడం తెలుగు ఇళ్ళలో వందల సంవత్సరాలుగా ఉన్న ఆచారం. అలాంటి మాటలు ఈ కాలం వారికి నచ్చకపోవచ్చు కాని, పెరుగు వల్ల ఆరోగ్యానికి ఎన్నెని ఉపయోగాలు ఉన్నాయో, రోజు పెరుగు ఎందుకు తీసుకోవాలో తప్పకుండా తెలుసుకోవాలి… పంచభక్ష పరవాన్నం పెట్టినా సరే ఆఖరులో పెరుగుతో.. అతిధికి ఒక్క ముద్దు భోజనం పెట్టకపోతే అది భోజనమే కాదంటారు మన పూర్వీకులు. అలంటి పెరుగుని ఒక పది పదార్ధాలతో కలిపి తింటే అద్భుతమైన ఫలితం ఇస్తుంది అంటున్నారు మన పెద్దలు. ఇంతకూ అవేంటో తెలుసుకుందాం…

కొద్దిగా జీల‌క‌ర్రను తీసుకుని పొడి చేసి దాన్ని ఓ కప్పు పెరుగులో క‌లుపుకుని తింటే త్వర‌గా బ‌రువు త‌గ్గుతారు. కొద్దిగా న‌ల్ల ఉప్పు (రాక్ సాల్ట్ ఆయుర్వేదిక్ స్టోర్ లలో లభిస్తుంది) ను తీసుకుని బాగా పొడి చేయాలి. దాన్ని ఓ క‌ప్పు పెరుగులో క‌లుపుకుని తాగాలి. దీంతో జీర్ణ సంబంధ స‌మ‌స్యలు దూర‌మ‌వుతాయి. ప్రధానంగా గ్యాస్‌, అసిడిటీ వంటివి త‌గ్గుతాయి. కొద్దిగా పెరుగులో చ‌క్కెర క‌లుపుకుని తినాలి. దీంతో శ‌రీరానికి వెంట‌నే శ‌క్తి అందుతుంది. మూత్రాశ‌య సంబంధ స‌మ‌స్యలు కూడా పోతాయి. కొంత వాము తీసుకుని ఓ క‌ప్పు పెరుగులో క‌లిపి తినాలి. దీని వ‌ల్ల నోటి పూత, దంతాల నొప్పి, ఇత‌ర దంత సంబంధ స‌మ‌స్యలుంటే త్వరగా పోతాయి. ఓ క‌ప్పు పెరుగులో కొంత న‌ల్ల మిరియాల పొడిని క‌లిపి తినాలి. దీని వ‌ల్ల మ‌ల‌బ‌ద్దకం దూర‌మ‌వుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమ‌వుతుంది. పెరుగులో కొన్ని ఓట్స్ క‌లిపి తినాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మంచి ప్రోబ‌యోటిక్స్‌, ప్రోటీన్లు ల‌భిస్తాయి. ఇవి కండ‌రాల పుష్టికి దోహ‌దం చేస్తాయి.

పెరుగులో వివిధ ర‌కాల పండ్లను క‌లిపి తింటే శ‌రీర రోగ నిరోధ‌క వ్యవ‌స్థ ప‌టిష్టమ‌వుతుంది. ప‌లు ర‌కాల ఇన్ ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు. పెరుగులో కొంత ప‌సుపు, కొంత అల్లం క‌లిపి తినాలి. దీని వ‌ల్ల ఫోలిక్ యాసిడ్ శ‌ర‌రీంలోకి చేరుతుంది. ఇది చిన్నారుల‌కు, గ‌ర్భిణీ మ‌హిళ‌ల‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది. పెరుగులో ఆరెంజ్ జ్యూస్ క‌లిపి తింటే శ‌రీరానికి త‌గినంత విట‌మిన్ సి ల‌భిస్తుంది. ఇది కీళ్ల నొప్పుల‌ను త‌గ్గిస్తుంది. వృద్ధాప్య చాయ‌ల‌ను దూరం చేస్తుంది. పెరుగులో తేనె క‌లిపి తీసుకుంటే క‌డుపులో ఉన్న అల్సర్లు మటుమాయ‌మైపోతాయి.

ఈ మిశ్రమం యాంటీ బయోటిక్‌గా ప‌నిచేస్తుంది. దీని వ‌ల్ల శ‌రీరంలో ఉన్న ఇన్‌ఫెక్షన్లు వెంట‌నే త‌గ్గుతాయి. పెరుగులో కాల్షియం, విటమిన్ డి ప్రోటీన్, పాజిటివ్ బ్యాక్టీరియా ఉంటాయి. బిర్యాని సెంటర్స్ లో పెరుగు ఎందుకు ఇస్తారో తెలుసా? స్పైసీ ఫుడ్ వలన ఒంట్లో జెనరేట్ అయ్యే హీట్ ని పెరుగు న్యూట్రలైజ్ చేస్తుంది. పెప్టిక్ అల్సర్స్ ని ట్రీట్ చేయడానికి ఉపయోగపడుతుంది. పెరుగు లో గట్ బ్యాక్టీరియా ఉండటం వల్ల ఇది క్రిములతో బాగా పోరాడుతుంది. రోగనిరోధక శక్తి పెంచటంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ తో ఇబ్బందిపడే మహిళలకు ఇది ఎంతో ఉపయోగం. యోనిపై ఇన్ఫెక్షన్స్ దాడి చేయకుండా అడ్డుకోవాలంటే పెరుగుని డైట్ లో చేర్చుకోవాలి.