పెళ్లికి ముందు ప్రతి తల్లి తన కొడుక్కి ఈ 5 విషయాలు తప్పక చెప్పాలట ! ఎందుకో తెలుసా

0
1490

పెళ్ళైన ఆడపిల్లకు అత్తారింట్లో ఎలా నడుచుకోవాలో తల్లి అన్నీ నేర్పించి పంపుతుంది.అలాగే పెళ్లి కాబోతున్న కొడుక్కి తల్లి కొన్ని విషయాలను చెప్పాలట.అందులో ఇప్పుడు చెప్పబోయే ఈ ఐదు విషయాలు తప్పకుండా చెప్పి అవి తుచా తప్పక పాటించాలని చెప్పాలట.
ఏవి ఏమిటో తెలుసుకుందాం.
1.ఎలాంటి సమయంలోనైనా తల్లితో భార్యను పోల్చకూడదు.తల్లి వేరు భార్య వేరు తల్లికి 20 లేదా 25 సంవత్సరాల అనుభవం ఉంటుంది కానీ భార్యను అనుభవం ఉండదు . నిన్ని నేను ఎలా అల్లారుముద్దుగా పెంచాని అలానే ఆ అమ్మాయిని వారి తల్లిదండ్రులు పెంచి ఉంటారు కావున ఆమెకు కొంత సమయం ఇస్తే నీకు ప్రేమామూర్తి అయిన భార్యగా ా తరువాత నే బిడ్డకు తల్లిగా నాకు గొప్ప కోడలుగా ఉంటుంది.
2.నే భార్య నీకు ఒక సఖి స్నేహితురాలు తను తన ఇంటి వారినందరిని వదులుకొని నీతో జీవితం పంచుకోవడానికి నే ఇంటికి వస్తుంది తల్లికి నిన్ను పోషించడమే ముఖ్యం కానీ నీకు నీ భార్య ఆలనా పాలనా ముఖ్యం.అలాగే మే ఇద్దరు అన్యోన్యంగా ఉండాలి
3.నీకు కాబోయే భార్య నే జీవితంలో జరిగే ప్రతి ఒడిదుడుకులలోనూ విజయాలలోను పాలు పంచుకుంటుంది . నీ ప్రతి అడుగులోనూ సహాయ సహకారాలు ప్రేమానురాగాలను పంచే వ్యక్తి.తనతో ఏది దాచకూడదు.దాంపత్యంలో ఆలుమగల మధ్య దాపరికాలు ఉండకూడదు నీ భార్య అభిప్రాయాలకు విలువ ఇచ్చి ఆమెతో ఏకీభవించి సంతోషంగా జీవించడమే మంచిది.

4.మెట్టినింటికి వచ్చిన భార్యకు నీవు ఎప్పుడు సహకారం అందించాలి ఎందుకంటే నే కొరకు పుట్టింటి వారిని వదులుకొని అలాగే ఇంటిపేరు గోత్రాన్ని మార్చుకొని వస్తుంది కావున చిన్న చిన్న విషయాలకే గొడవ పడకుండా ఒకరినొకరు అర్థం చేసుకొని సర్దుకుపోవాలి.ఆమె పుట్టినింట్లో ఎంత సంతోషంగా ఉండేదో అలానే ఇక్కడ ఉండేలా చూసుకోవాలి లేకుంటే మన ఇంటికే అరిష్టం నే ధనం రెట్టింపు చేసుకోవడానికి ఇల్లాలి సంతోషమే కారణం.
5.మే నాన్న నన్ను ఎంత గౌరవ మర్యాదలతో సుఖసంతోషాలతో ప్రేమానురాగాలతో చూసుకున్నాడో నీవు కూడా నే భార్యను అలానే చూసుకోవాలి దీనివలన మన వంశం వృద్ధిలోకి వస్తుంది అలాగే గొప్పగా జీవిస్తారు.

ఈ విధంగా ప్రతి తల్లి తన కొడుక్కి పెళ్లికి ముందు తప్పకుండా చెప్పి పాటించేలా చూడాలి.