పెళ్లి కార్డు లక్షన్నర, పెళ్ళికొడుకు కానుకలు ఎన్నో తెలుసా..!!

0
1221

పెద్దోల్లంటే పేద్దోల్లే దేనికైనా పెట్టీ పుట్టాలి అంటారు పెద్దలు.బిడ్డల పెళ్లిళ్లు చేయడానికి పేదొడు అష్టకష్టాలు పడుతుంటే పెద్దోడు మాత్రం తన బిడ్డల పెళ్లిళ్లకు దేనికి ఎంత మొత్తం లో ఖర్చు పెట్టాల అని ఆలోచిస్తున్నాడు.వానలు లేక వర్షాలు రాకా పంట కోసం రైతు అప్పులు చేసి విత్తనాలు ఎరువులు తెచ్చి ఆ పంట సరిగా పండక తెచ్చిన అప్పు కట్టలేక బ్యాంక్ వాళ్ళు ఇల్లు జప్తి చేస్తే వీడిన పడి రాయితీ రోజువారీ కూలీగా మారి అలాగే చివరకు అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వీరి పరిస్థితిని పట్టించుకునేవారు కరువయ్యారు కానీ బడా బాబులు మాత్రం తమ బిడ్డల పెళ్లిళ్లకు కోట్లకు కోట్లు ఖర్చు పెడుతున్నారు.ఆ మధ్య కేసుల్లో ఇరుక్కొని జైల్ కి వెళ్లి వచ్చిన గాలి జనార్దన్ రెడ్డి తను కూడబెట్టిన అక్రమాస్తులతో బిడ్డ పెండ్లికి ఒక్కొక్క శుభలేఖ ను 60 వేల రూపాయలతో ముద్రించిన విషయం అందరికి తెలిసిందే.

అయితే తాజాగా NTV అధినేత నరేంద్ర చౌదరి తన కూతురు పెళ్లికి ఏకంగా ఒక్కో శుభలేఖకు లక్షన్నర రూపాయలు ఖర్చు చేస్తున్నాడట.ఈ నెల 23 వా తేదీన శంషాబాద్ లో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో పెళ్లి చాలా ఘనంగా జరుగబోతోంది.ఈ పెళ్లికి దేశ విదేశాల నుంచి ప్రముఖులను పిలుస్తున్నారు.ఒక్కో శుభలేఖకు లక్షన్నర ఖర్చుతో 250 శుభలేఖలకి లక్ష ఖర్చుతో 300 శుభలేఖలకి అలాగే మూడవ రేంజ్ కార్డుకి వేళల్లో ఖర్చు చేసి ముద్రించారు అని తెలుస్తుంది ఈ కార్డ్ తో పాటు బంగారం వెండి పట్టుపంచే పట్టుచీర పెట్టి ఒక సూట్కేస్ లో పెట్టీ పత్రిక ఇస్తున్నారట.ఇప్పటికే కొంతమంది ప్రముఖులు అందుకున్నారట.ఓ ప్రముఖ వ్యాపారవేత్త కొడుక్కి తన కూతురును ఇచ్చి కాబోయే అల్లుడికి 50 కోట్ల విలువ చేసే హెలికాప్టర్ ను గిఫ్ట్ గా ఇస్తున్నారట.గాలి జనార్ధన్ రెడ్డి కి అక్రమాస్తులు ఉన్నాయి కానీ నరేంద్ర చౌదరి ఎలాంటి అక్రమాస్తులు లేవు అలాగే ఇతని దగ్గర ఉన్న ప్రతి పైసకి లెక్క ఉందని చెప్తున్నారు దీంతో ఆయన తన కూతురు పెళ్లి ఎంత ఘనంగా జరిపినా ఎలాంటి ఇబ్బందులు రావు అంటున్నారు కొందరు.