ప్రదీప్‌కు వైజాగ్‌ నుండి పెళ్లి సంబంధం.. కట్నం ఎంతో తెలిస్తే షాక్‌.. ప్రదీప్‌ సమాధానం ఏంటో తెలుసా?

0
1520

ఇటీవల బుల్లి తెరపై యాంకర్‌ ప్రదీప్‌ స్టార్‌ అయ్యాడు. గత రెండు సంవత్సరాలుగా బుల్లి తెరపై సంచలనాలు సృష్టిస్తున్న ప్రదీప్‌కు హీరో రేంజ్‌లో గుర్తింపు దక్కింది. ముఖ్యంగా ఈయన చేస్తున్న కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా షోకు అనూహ్యమైన స్పందన వచ్చింది. స్టార్‌ సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేసే ఆ షోను ప్రధీప్‌ స్వయంగా నిర్మిస్తున్న విషయం తెల్సిందే.ఆ షోతో పాటు ఎన్నో రియాల్టీ షోలను, గేమ్‌ షోలను హోస్ట్‌ చేస్తున్న ప్రదీప్‌ నెలకు 25 నుండి 30 లక్షలు సంపాదిస్తున్నట్లుగా బుల్లి తెర వర్గాల నుండి సమాచారం అందుతుంది. ప్రదీప్‌ భారీ స్థాయిలో సంపాదిస్తున్న నేపథ్యంలో ఆయనకు పిల్లను ఇచ్చేందుకు ఎంతో మంది క్యూ కడుతున్న విషయం తెల్సిందే..

ప్రదీప్‌ తన పెళ్లి గురించి ఎక్కువ షోల్లో జోకులు వేసుకుంటూ ఉంటాడు. పెళ్లి చేసుకుందాం అంటే అమ్మాయి దొరకడం లేదని, కొందరు అమ్మాయిలు నన్ను తిరష్కరించారు అంటూ జోకులు వేస్తూ ఉంటాడు. కాని ప్రదీప్‌కు అమ్మాయిల్లో ఉన్న ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు.ప్రదీప్‌ ఎక్కడ ఏ షో చేసినా కూడా లేడీస్‌ ఫ్యాన్స్‌ ఎక్కువా ఉంటారు. ఆయన చేసే ప్రతి షోను అమ్మాయిలు ఎక్కువ శాతం చూస్తారు. బుల్లి తెరపై అత్యధిక లేడీస్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న వ్యక్తి ప్రదీప్‌ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రదీప్‌ ప్రస్తుతం లెక్కకు మించిన షోు చేస్తున్నాడు.

సినిమాల్లో కూడా అడపా దడపా కనిపిస్తున్నాడు. ఇక ప్రదీప్‌కు కుటుంబ సభ్యులు వివాహం చేసేందుకు సిద్దం అవుతున్నాడు. గత సంవత్సర కాలంగా ప్రదీప్‌కు బాగా సెట్‌ అయ్యే అమ్మాయి కోసం అన్వేషిస్తున్నారు. ఇటీవల వైజాగ్‌ నుండి ఒక ప్రముఖ రియల్టర్‌, వ్యాపారవేత్త తన కూతురును ప్రదీప్‌కు ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు.ఆయన ప్రదీప్‌ తల్లిదండ్రులతో మాట్లాడటం కూడా జరిగిందట. ప్రస్తుతం అమెరికాలో ఎమ్మెస్‌ చేస్తున్న తన కూతురును ప్రదీప్‌ పెళ్లి చేసుకుంటే 5 కోట్ల కట్నంతో పాటు విశాఖపట్నంలో ఖరీదైన ఏరియాలో ఉన్న రెండు ఫ్లాట్‌లను సైతం ఇస్తానన్నాడట.తన కూతురుకు ప్రదీప్‌ అంటే ఇష్టం అని, అందుకే కట్నం ఎంతైనా ఇచ్చేందుకు రెడీ అంటూ ప్రదీప్‌ తల్లిదండ్రులను ఆయన ఒప్పించే ప్రయత్నం చేశాడట. కాని ప్రదీప్‌ మాత్రం ఆ అమ్మాయిని తిరష్కరించాడు. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదంటూ ఆయన ఇచ్చిన ఆఫర్‌ను పక్కకు పెట్టాడట.

పెళ్లి చేసుకోవాలని ప్రదీప్‌ భావిస్తున్నా కూడా ఆయన ఇచ్చిన ఆఫర్‌ను ఎందుకు తిరష్కరించాడని బుల్లి తెర వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఒక వేళ అమ్మాయి ప్రదీప్‌కు నచ్చి ఉండకపోవచ్చు అంటూ కొందరు అంటున్నారు. కట్నం కంటే అమ్మాయికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలనే ఉద్దేశ్యంతో కూడా ప్రదీప్‌ ఆమెను వద్దని ఉంటాడని కొందరు అంటున్నారు.


మరి కొందరు మాత్రం ప్రదీప్‌ ప్రేమలో ఉన్నాడని, అందుకే తల్లిదండ్రులు చూస్తున్న ఏ సంబంధంకు ప్రదీప్‌ ఓకే చెప్పడం లేదని అంటున్నారు. మరో రెండు సంవత్సరాలు ఆగిన తర్వాత ప్రదీప్‌ పెళ్లి చేసుకుంటాడని తాజాగా ఒక యాంకర్‌ చెప్పుకొచ్చాడు.ప్రదీప్‌కు చాలా క్లోజ్‌గా ఉండే ఆ యాంకర్‌ ఇంకా మాట్లాడుతూ ప్రదీప్‌కు పెళ్లిపై చాలా క్లారిటీ ఉంది, ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకుంటాడని తాను భావిస్తున్నాను అన్నాడు. ప్రదీప్‌ ప్రేమ విషయంపై ఆయన మాట్లాడేందుకు తిరష్కరించాడు.ప్రేమిస్తున్నాడా అనే ప్రశ్నకు నవ్వేశాడు. మొత్తానికి ప్రదీప్‌ హీరో రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకోవడంతో ఆయన పెళ్లి గురించి తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.