బిడ్డకు పాలిస్తున్నానని తల్లి అరుస్తునే ఉన్నా పోలీసులు ఏం చేశారో వీడియోలో చూడండి..

0
919

ఫ్రెండ్లీ పోలీస్ అని ఎవరు ఎంతగా మొత్తుకుంటున్నా, తమ కరుకు ఖాకీ గుండెలు మాత్రం మారబోవని ఖాకీలు కొన్ని సందర్భాల్లో ఇంకా నిరూపిస్తునే ఉన్నారు. ముంబైలో జరిగిన తాజా ఘటన ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది.

కారులో వెళ్తున్న ఓ తల్లి తన బిడ్డ ఆకలితో ఏడుస్తుండడంతో కారును రోడ్డుపై ఆపి పాలిస్తోంది.రోడ్డుపై ‘నో పార్కింగ్’ ప్రదేశంలో ఆగిన కారును చూసిన ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. కారులో మహిళ ఉందని, ఆమె తన బిడ్డకు పాలిస్తోందని తెలిసినా ఏ మాత్రం కనికరం చూపలేదు. మానవత్వాన్ని మర్చిపోయారు.మహిళ, చిన్నారి కారులో ఉండగానే రికవరీ వ్యాన్‌కు ఆ కారును తగిలించి తీసుకుపోయారు. తాను కారులో ఉన్నానని, బిడ్డకు పాలిస్తున్నానని మహిళ అరిచి గీపెట్టినా పోలీసులు పట్టించుకోలేదు.

పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో సదరు ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసిన ముంబై జాయింట్ కమిషనర్ (ట్రాఫిక్) అమితేష్ కుమార్ దర్యాప్తుకు ఆదేశించారు.