బుల్లితెర విషాదం:టీవీ నటి, యాంకర్‌ మల్లిక మృతి

0
949

టీవీ నటి, వ్యాఖ్యాత మల్లిక చనిపోయింది. 39 సంవత్సరాల మల్లిక.. 20 ఏళ్ల క్రితం టీవీ వ్యాఖ్యత, యాంకర్ గా పరిచయం అయ్యింది. ఆమె అసలు పేరు అభినవ.ఆ తర్వాత అనేక సీరియల్స్ లో నటించింది. మహేష్ బాబు ఫస్ట్ మూవీ రాజకుమారుడు సినిమాలో కృష్ణకు భార్యగా నటించింది. కొన్ని సినిమాల్లో అక్క, అత్త పాత్రల్లోనూ నటించింది. ఎక్కువగా టీవీ సిరియల్స్ ద్వారా ఇంటింటికీ పరియం అయ్యింది. ప్రముఖ యాంకర్ సుమకు స్నేహితురాలు. సమకాలీనురాలు.

మల్లిక భర్త విజయ్ సాయి బెంగళూరులో ఉంటున్నారు. ఇటీవలే ఆమె భర్త దగ్గరకు వెళ్లింది. అక్కడికి వెళ్లిన తర్వాత అనారోగ్యానికి గురైంది. ఆస్పత్రిలో చేర్చారు. గత 20 రోజులుగా కోమాలో ఉంది. అక్టోబర్ 9వ తేదీ సోమవారం ఉదయం కన్నుమూసింది మల్లిక. యాంకర్ గా టీవీ రంగంలో ప్రవేశించి.. అనతికాలంలోనే మంచి యాంకర్ గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమాల్లోనూ నటించింది. నాతిచరామి అనే సీరియల్ లో ప్రస్తుతం బామ్మ పాత్రలో నటిస్తుంది. కొంతకాలంగా ఒబేసిటీ, శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడుతుంది. 1999లో రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన రాజకుమారుడు చిత్రంలో కృష్ణ భార్యగా నటించింది. అనారోగ్యం కారణంగా కొంతకాలంగా నటనకు దూరంగా ఉంటుంది. బెంగుళూరు నుంచి ఆమె భౌతికకాయం రేపు ఉదయం హైదరాబాద్ వచ్చే తీసుకురానున్నట్లు సమాచారం. టీవీ రంగానికి చెందిన పలువురు సంతాపం తెలిపారు.